E-Paper
Advertisement

OTT Movie : కజిన్ బాయ్ ఫ్రెండ్ పై అమ్మాయి కన్ను… ప్రెగ్నెన్సీ కూడా… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదుర్స్

OTT Movie : కజిన్ బాయ్ ఫ్రెండ్ పై అమ్మాయి కన్ను… ప్రెగ్నెన్సీ కూడా… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదుర్స్
Advertisement

OTT Movie : థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు లవ్ స్టోరీ కలిపితే, ఆ సినిమా మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అలా ఎంటర్టైన్ చేసే ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “గెహ్రయియాన్”  (Gehraiyaan)  ఈ మూవీ రిలేషన్ లో ఉన్న రెండు జంటల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

అలీషా యోగా టీచర్ గా పని చేస్తూ కరణ్ అనే వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. కరణ్ అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక రైటర్ గా ఉంటాడు. అలీషా కి తల్లి చనిపోవడంతో, తండ్రి సిటీ నుంచి పల్లెటూరికి వెళ్లిపోయి ఉంటాడు. అతడు అలా వెళ్ళిపోయినందుకు అలీషా తండ్రిపై కోపంగా ఉంటుంది. అలీషా కి సియా అనే ఒక కజిన్ ఉంటుంది. సియా జైన్ అనే డబ్బున్న వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంటుంది. ఒకరోజు సియా ఒక పార్టీకి అలీషా జంటను ఇన్వైట్ చేస్తుంది. ఆ పార్టీకి వచ్చిన అలీషా సియా బాయ్ ఫ్రెండ్ కి యోగా ఎలా చేయాలో నేర్పిస్తుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. మొదట ఇలా జరిగినందుకు అలీషా బాధపడుతుంది. అయితే ఆ తర్వాత జైన్ తో సీక్రెట్ గా లవ్ ఎఫైర్ కొనసాగిస్తుంది. వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా రిలేషన్షిప్ కొనసాగుతుంది. ఆలీషా కి జైన్ యోగ స్కూల్ ని ఎవరికీ తెలియకుండా బహుమతిగా ఇస్తాడు.

బిజినెస్ బాగా డెవలప్ అయ్యాక అలీషాని పెళ్లి చేసుకుంటానని జైన్ మాటిస్తాడు. అయితే అనుకోకుండా జైన్ బిజినెస్ ఫైనాన్షియల్ గా దెబ్బతింటుంది. ఆ పరిస్థితుల్లో సియాకి ఉన్న ఫామ్ హౌస్ తాకట్టుపెట్టి తన ఫైనాన్షియల్ ప్రాబ్లంని సేవ్ చేసుకుంటాడు. సియా కూడా అతన్ని అనుమానించకుండా హెల్ప్ చేస్తుంది. ఇలా జరుగుతుండగా అలీషా ప్రెగ్నెంట్ అవుతుంది. జైన్ కి ఫోన్ చేసి మన రిలేషన్ షిప్ ని అందరి ముందు అనౌన్స్ చేయాలని ఒత్తిడి చేస్తుంది. ఆలీషాను ఎలాగైనా చంపాలని ఒక షిప్ లోకి పిలిపిస్తాడు జైన్. ఆమెకు మత్తుమందు ఇచ్చి చంపాలనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న అలీషా అక్కడినుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. జైన్ ఆమె బయటికి వెళ్తే ప్రమాదమని నీళ్లల్లో తోయాలని చూస్తాడు. ఆ ఘటనలో జైన్ నీళ్లలో పడి చనిపోతాడు. చివరికి జైన్ చావుకి కారణం అలీషా అని అందరికీ తెలుస్తుందా? అలీషాకి జైన్ తో ఉన్న సంబంధం సియాకి తెలుస్తుందా? పోలీసులు ఈ హత్య కేసును వెలుగులోకి తెస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×