E-Paper
Advertisement

OTT Movie: సొంత పిల్లల్ని చంపాలనుకునే కన్నతల్లి… కలలో కూడా ఊహించని హార్రర్ స్టోరీ

OTT Movie: సొంత పిల్లల్ని చంపాలనుకునే కన్నతల్లి… కలలో కూడా ఊహించని హార్రర్ స్టోరీ
Advertisement

OTT Movie : హాలీవుడ్ హారర్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇందులో ఏకంగా కన్న తల్లే సొంత పిల్లలను చంపాలి అనుకుంటుంది. కలలో కూడా ఊహించలేని స్టోరీతో తెరకెక్కిన ఈ హారర్ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే విషయంలోకి వెళ్తే..

ఏడాదిన్నర తరువాత ఓటీటీలోకి 

Advertisement

బ్లాక్ బస్టర్ హారర్ చిత్రం ఈవిల్ డెడ్ రైజ్ థియేట్రికల్ విడుదలైన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి సందడి లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్‌తో వచ్చి నష్టాలను మిగులుస్తాయి. మరికొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసినా భారీ మొత్తంలో వసూళ్లు సాధిస్తున్నాయి. ఈవిల్ డెడ్ రైజెస్‌ను తక్కువ బడ్జెట్‌లో నిర్మించి పెద్ద మొత్తంలో సంపాదించారు నిర్మాతలు. ఈ హారర్ సినిమా సూపర్ హిట్ సినిమా గతేడాది ఏప్రిల్‌లో యూఎస్ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా సమయంలో దర్శకుడు మొదట ఈవిల్ డెడ్ రైజ్ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. కానీ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయడంతో మొదట కొన్ని థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. సాటర్న్ అవార్డ్స్‌లో ఈవిల్ డెడ్ రైజ్ ఉత్తమ హారర్ చిత్రంగా నిలిచింది. ఇది హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకుంది.

MOVIE REVIEW | Evil Dead Rise |

Advertisement

ఈవిల్ డెడ్ రైజ్ కథ ఏంటంటే ?
సింగిల్ పేరెంట్ ఎల్లీ (అలిస్సా సదర్లాండ్) తన ముగ్గురు పిల్లలను పెంచడానికి చాలా కష్టపడుతుంది. ఒకరోజు ఎల్లీ బెత్ కొడుకు ఇంటి నేలమాళిగలో ఉన్న ఒక పెట్టెను తెరిచి, అందులో ఉన్న గ్రామఫోన్ రికార్డ్ ప్లే చేస్తాడు. ఆ గ్రామఫోన్ కారణంగా అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఎల్లీ తన పిల్లలను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ గ్రామఫోన్ రికార్డుల్లో ఏముంది? ఎల్లీ అలా మారడానికి కారణం ఏమిటి? తల్లి, ముగ్గురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారా? చివరికి ఏం జరిగింది అనేది సినిమా కథ.

లిల్లీ సుల్లివన్, అలిస్సా సదర్లాండ్, మీరాబాయి పీస్, అన్నా-మేరీ థామస్, నోహ్ పాల్, రిచర్డ్ క్రౌచ్లీ, గాబ్రియేల్ ఎకోల్స్, మోర్గాన్ డేవిస్, నెల్ ఫిషర్ ఇతరులు ఈ సినిమాలో నటించారు. గతేడాది ఈవిల్ డెడ్ రైజ్ మూవీ అమెరికాలోని ఓటీటీలో విడుదలైంది. భారతదేశంలో మాత్రం ఏడాదిన్నర తర్వాత ప్రైమ్ వీడియోలో వచ్చింది. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీలో నిర్మించిన ఐదవ చిత్రం ఇది. ఈవిల్ డెడ్ సిరీస్‌లోని మొదటి మూడు భాగాలకు సామ్ రైమి దర్శకత్వం వహించారు. ఈవిల్ డెడ్ రైజ్, ఈవిల్ డెడ్ 4 చిత్రాలకు ఫెడే అల్వారెజ్ దర్శకత్వం వహించారు. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీలో మరో రెండు సినిమాలు రానున్నాయి. ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీలో విడుదలైన హారర్ చిత్రాలన్నీ కమర్షియల్‌గా విజయం సాధించాయి. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈవిల్ డెడ్ రైజ్ 150 కోట్లకు పైగా వసూలు చేసింది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×