E-Paper
Advertisement

OTT Movie : అడిగిన కోరికలు తీర్చే దెయ్యాలు… తల్లిదండ్రులు చనిపోయిన అమ్మాయికే ఈ స్పెషల్ ఆఫర్

OTT Movie : అడిగిన కోరికలు తీర్చే దెయ్యాలు… తల్లిదండ్రులు చనిపోయిన అమ్మాయికే ఈ స్పెషల్ ఆఫర్
Advertisement

OTT Movie : హర్రర్ థ్రిల్లర్ చిత్రాలను చూడాలంటే ఎవరికైనా కాస్త ధైర్యం ఉండాల్సిందే. ఎందుకంటే హర్రర్ మూవీస్ లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రాత్రి అయితే ఈ మూవీస్ ని ఒంటరిగా చూడాలంటే మాత్రం వనికిపోతారు.  ధైర్యం లేని వాళ్ళు చూస్తే అంతే సంగతులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ చాలా ఉన్నాయి. అటువంటి ఒక హర్రర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో? తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “డుయుసీ వాట్ ఐసీ” (Do you see What I see). తల్లిదండ్రులు చనిపోవటంతో హీరోయిన్ ఒక  వయసుకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ వేటలో పడుతుంది. కంటికి కనబడని కొన్ని శక్తులు ఈమెకు సహాయం చేస్తాయి. ఈ సన్నివేశాల మధ్యనే మూవీ నడుస్తుంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ గుండె ఆగిపోయిందేమో అన్నంతగా ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరోయిన్ ఒక హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ఆ గర్ల్స్ హాస్టల్ లో హీరోయిన్ తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉంటారు. హీరోయిన్ తన పుట్టినరోజు కావడంతో తల్లిదండ్రుల సమాధుల దగ్గరకి వెళుతుంది. ఆ సమాధులను చూసి ఈరోజు నా పుట్టినరోజు మీరు ఉంటే నాకు ఎంతో బాగుండేది అంటూ ఏడుస్తుంది. మీరు లేని లోటు ఎవరూ తీర్చలేరని చెబుతూ, నాకు ఇది 20వ పుట్టినరోజు నన్ను కేరింగ్ గా చూసుకునే ఒక బాయ్ ఫ్రెండ్ ని మీరే చూడాలంటూ ఆ సమాధుల వైపు చూస్తూ అడుగుతుంది. అందుకుగాను అక్కడ ఒక చిన్న చెక్క బొమ్మ గాలికి కదులుతూ శబ్దం చేస్తుంది. ఆతరువాత హీరోయిన్ తిరిగి హాస్టల్ కి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కు ఆమె చదువుతున్న స్కూల్లోనే ఒక బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు.

ఆ విషయం హీరోయిన్ తన స్నేహితులకు కూడా చెబుతుంది. అయితే వీళ్ళకి ఎవరో ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ ఫోన్ చేసినప్పుడల్లా హీరోయిన్ సమాధుల దగ్గర వచ్చిన ఆ చెక్క బొమ్మ శబ్దం వస్తూ ఉంటుంది. హీరోయిన్ స్నేహితులకు ఆ దయ్యాలు చుక్కలు చూపిస్తాయి. చివరికి హీరోయిన్ చేతిలో ఆ బాయ్ ఫ్రెండ్ ఏమవుతాడు? వీళ్లకు కాల్ చేస్తున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? హీరోయిన్ తల్లిదండ్రుల ఆత్మలు ఆమెకు ఏ విధంగా సహాయ పడతాయి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న  డుయుసీ వాట్ ఐసీ  (Do you see What I see)  మూవీ ని తప్పకుండా చూడండి. ఒంటరిగా మాత్రం ఈ మూవీని చూడకండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×