E-Paper
Advertisement

OTT Movie : ఆ ఇంట్లోకి వెళితే తిరిగి రారు … కేక పుట్టించే కొరియన్ హర్రర్ మూవీ

OTT Movie : ఆ ఇంట్లోకి వెళితే తిరిగి రారు … కేక పుట్టించే కొరియన్ హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు చాలామంది ఉంటారు. ఈ సినిమాలు చూస్తూ మూవీ లవర్స్ ఒక  రేంజ్లో ఎంటర్టైన్ అవుతారు. అయితే కొన్ని హర్రర్ సినిమాలు చూడాలంటే ఒంటరిగా చూడటం కష్టంగానే ఉంటుంది. అది కూడా రాత్రిపూట అయితే మరి చెప్పాల్సిన పని లేదు. గూస్ బంప్స్ తెప్పించే ఒక హర్రర్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్టీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకునే కొరియన్ మూవీ పేరు ‘డెవిల్ ఇన్ ద లేక్‘ (Devil in the lake).ఈ మూవీలో ఒక ముసలి దయ్యం తన ఇంట్లో పని వాళ్ళని చంపుతూ ఉంటుంది. ఈ ముసలి దయ్యం చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరోయిన్ ఒక ఇంట్లో పనిమనిషి అవసరం ఉండటంతో పనిచేయడానికి అక్కడికి వెళుతుంది. ఆ ఇంటికి సమీపంలోనే ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు ఆ ఇంట్లో ఇంతకుముందు పనిచేసిన ఒక అమ్మాయి. ఈ విషయం హీరోయిన్ కి తెలియదు. ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఒక మహిళ హీరోయిన్ ను రిసీవ్ చేసుకుంటుంది. ఆమె హీరోయిన్ తో పిల్లలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. హీరోయిన్ నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్తుంది. నువ్వు ఈ ఇంట్లో ఒక ముసలామెను చూసుకోవాలని చెప్తుంది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, రాత్రిపూట ఆమె బయటికి రాకుండా తలుపులు గట్టిగా వేయాలని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన బ్యాగులో తెచ్చుకున్న కూతుర్ని బయటకు తీస్తుంది. హీరోయిన్ కి డబ్బు చాలా అవసరం ఉంటుంది. ఆ ఇంట్లో ఒక డైమండ్ రింగ్ ఉందని తెలుసుకుంటుంది. ఇంట్లో పని చేస్తూ ఆ డైమండ్ రింగును తీసుకొని సెటిల్ అయిపోవాలని అనుకుంటుంది.

హీరోయిన్ ఆ ముసలామెకు సేవలు చేస్తూ తన కూతుర్ని ఎవరికంట పడకుండా చూసుకుంటూ ఉంటుంది. రాత్రిపూట ఒకరోజు డైమండ్ రింగ్ కోసం వెతకుతూ ఉండగా, మంత్రాలు రాసిన కొన్ని పేపర్లు హీరోయిన్ చూస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హీరోయిన్ కు ఒక వ్యక్తి ఎదురుపడి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తాడు. ముసలామెకు ఆత్మలు బంధించే శక్తి ఉందని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూతురు కనిపించకుండా పోతుంది. కూతుర్ని వెతకగా ఒకచోట భయంతో కూతురు ఉండటాన్ని చూసి ఏమైందని ప్రశ్నిస్తుంది. కూతురు తనకి దయ్యం కనిపించిందని అది ఎక్కడుందో చూపిస్తుంది. దయ్యాలను చూసి హీరోయిన్ కి వణుకు పుడుతుంది. చివరికి హీరోయిన్ ఆ డైమండ్ రింగ్ ను తీసుకుంటుందా? హీరోయిన్ ఆ ఇంట్లో నుంచి బయట పడగలుగుతుందా? ఆ ముసలామే చేతిలో బలవుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×