E-Paper
Advertisement

OTT Movie : ఆ బుక్ చదివారంటే స్వయంగా సమాధిని తవ్వుకున్నట్టే… ఓటిటిని ఊపేస్తున్న హారర్ మూవీ

OTT Movie : ఆ బుక్ చదివారంటే స్వయంగా సమాధిని తవ్వుకున్నట్టే… ఓటిటిని ఊపేస్తున్న హారర్ మూవీ
Advertisement

OTT Movie : ఓటిటిలో హార్రర్ సినిమాల హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా రిలీజ్ అయిన ఓ హర్రర్ మూవీ ఏకంగా ఓటిటిని ఊపేస్తోంది. భారీ సంఖ్యలో వ్యూస్ ను రాబట్టి రికార్డును క్రియేట్ చేయడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ హార్రర్ మూవీని ఎక్కడ చూడొచ్చు? సినిమా పేరేంటి? స్టోరీ ఏంటి ? అనే విషయాలను చూసేద్దాం పదండి.

జీ 5 లో స్ట్రీమింగ్

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీలో ప్రియా భవాని శంకర్, అరుళ్ నిధి హీరో హీరోయిన్ గా నటించారు. ఇదొక కోలీవుడ్ హార్రర్ మూవీ. ఓటిటిలోకి వచ్చి వారం రోజులు దాటినప్పటికీ టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటిగా నిలవడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా హార్రర్ సినిమాలను ఇష్టపడే తెలుగు మూవీ లవర్స్ కు మూవీ తెలుగు లో ఉండడం గుడ్ న్యూస్. ఈ ఏడాదే ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హార్రర్ సీక్వెల్ దాదాపు 80 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. అంతేకాదు ఈ సంవత్సరం తమిళంలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలో గత వారం రిలీజ్ అయిన హార్రర్ మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ ను దక్కించుకున్న సినిమాగా రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హర్రర్ మూవీ మరేదో కాదు 2017లో తమిళంలో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్ గా వచ్చిన ‘డిమోంటి కాలనీ 2’. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ మూవీ ప్రస్తుతం జీ5 అనే ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏంటంటే…

Advertisement

డెబి అనే అమ్మాయి సామ్ రిచర్డ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడుతుంది. కానీ అనూహ్యంగా అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అసలు అతను ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇద్దరూ కవలల గురించి డెబి తెలుసుకుంటుంది. తన భర్తలాగే వారి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబి ఇద్దరు కవలల్ని కాపాడడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఈ హత్యలు అన్నింటికి కారణం డిమోంటి కాలనీలోని పాడుబడ్డ ఇంట్లో ఉన్న ఓ పుస్తకం కారణమని ఆ కవలలు తెలుసుకుంటారు. అసలు ఆ బుక్ చదివిన వారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఆత్మ బారి నుంచి ఇద్దరు కవలలు తమ ప్రాణాలను కాపాడుకున్నారా? డెబి ఈ బుక్ అన్వేషణలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అనే విషయాలు తెలియాలంటే ‘డిమోంటి కాలనీ 2’ మూవీని చూడాల్సిందే. ఒకవేళ ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఈ వీకెండ్ డోంట్ మిస్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×