E-Paper
Advertisement

OTT Movie : 8-ఎపిసోడ్‌ల హర్రర్ సిరీస్… IMDbలో 8.4 రేటింగ్‌… కల్లోనూ వెంటాడే రియల్ స్టోరీ

OTT Movie : 8-ఎపిసోడ్‌ల హర్రర్ సిరీస్… IMDbలో 8.4 రేటింగ్‌… కల్లోనూ వెంటాడే రియల్ స్టోరీ
Advertisement

OTT Movie : ప్రతి వారం రకరకాల ప్లాట్‌ఫామ్‌లలో కొత్త వెబ్ సిరీస్‌లు ఎన్నో విడుదలవుతాయి. కానీ కొన్ని మాత్రమే అందులో ప్రత్యేకంగా నిలుస్తాయి. అలా ఓటీటీలో విడుదలై చర్చనీయాంశంగా మారిన ఓ వెబ్ సిరీస్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే ఈ 8-ఎపిసోడ్‌ల సిరీస్ మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పైగా ఇది ఒళ్లు గగుర్పొడిచే హర్రర్ సిరీస్.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

నిజ జీవిత కథల ఆధారంగా హర్రర్ సినిమాలు రావడం చాలా అరుదు. కానీ నిజమైన సంఘటన ఆధారంగా రూపొందిన ఓ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఢిల్లీకి చెందిన ఒక అబ్బాయి కథను చూపించే సిరీస్ విడుదలైంది. ఆయనే భారతదేశపు మొట్టమొదటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ. ఇది ఆయన బయోపిక్ వెబ్ సిరీస్. 2016లో చనిపోయిన గౌరవ్ తివారీ అనే పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ మిస్టరీ మర్డర్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ‘భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ’ “Bhay The Gaurav Tiwari” అనే టైటిల్ తో ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. హర్రర్ మూవీ లవర్స్ ఇంకా సిరీస్ ను చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Advertisement

బీహార్ లోని పాట్నాలో 1984లో జన్మించిన గౌరవ్ తివారీ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ అతను చనిపోయిన విధానం అప్పట్లో ఒక మిస్టరీ. ఎన్నో అనుమానాలను రేకెత్తించిన ఆయన చావుకు కారణం దెయ్యాలే అన్నారు. ‘అభిరూప్ ధర్’ రాసిన ‘ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ: ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఇండియాస్ ఫోర్‌మోస్ట్ పారానార్మల్ ఇన్టెస్విగేటర్’ అనే బుక్ స్పూర్తితో రూపొందించారు. ఈ సిరీస్ లో కరణ్ టాకర్, కల్కి కొచ్లిన్ ప్రధాన పాత్రలు పోషించారు.

Read Also : పోలీసులకు చేతకాని కేసు లేడీ కిల్లర్ చేతికి… సీను సీనుకీ ఉత్కంఠ… ఏ ఓటీటీలో ఉందంటే?

కథలోకి వెళ్తే…

Advertisement

గౌరవ్ పైలట్ కావాలని కలలు కనే ఢిల్లీ అబ్బాయి. పైలట్ గా శిక్షణ తీసుకోవడానికి లండన్ కు వెళతాడు. అక్కడికి వెళ్ళాక కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది, అక్కడ అతను కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటాడు. అంతే పైలట్ కావాలనుకున్న అతని కల ఆ సంఘటనలతో మారుతుంది. ఊహించని టర్న్ తో ఆ అబ్బాయి దెయ్యంతో మాట్లాడే, ఆత్మలకు విముక్తి కలిగించేవాడు అవుతాడు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ ప్రత్యేకంగా తన సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకుని, అనేక కేసులను చేదిస్తాడు. మరో ప్రపంచానికి చెందిన వ్యక్తులను సంప్రదిస్తాడు. అయితే ఒక కేసులో అతను తన ప్రాణాలనే కోల్పోతాడు. మరి నిజంగానే గౌరవ్ చనిపోయాడా? అతను చనిపోవడానికి గల కారణం ఏంటి? పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ లో అతను ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులు ఏంటి? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ కు IMDbలో 8.4 రేటింగ్‌ ఉండడం విశేషం.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×