E-Paper
Advertisement

OTT Movie : ప్రతిరోజూ ఉదయాన్నే మెట్రోలో ఆ పని… పెళ్ళైన ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడికి దారి తీస్తుందంటే?

OTT Movie : ప్రతిరోజూ ఉదయాన్నే మెట్రోలో ఆ పని… పెళ్ళైన ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడికి దారి తీస్తుందంటే?
Advertisement

OTT Movie :  భార్యాభర్తల బంధానికి నమ్మకం అనేది బలమైన పునాదిగా మారుతుంది. అయితే రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కేవలం నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదు, అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. అనవసరంగా అపార్థం చేసుకుంటే జీవితం నరకంలా మారుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా భార్యాభర్తల మధ్య వచ్చిన అపార్ధాల వల్ల జీవితం ఏమౌతుందో తెలియజెప్పే ఫీల్ గుడ్ మూవీ. మరి ఈ సినిమా కథ ఏంటి? మూవీని ఎక్కడ చూడచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

జీ5లో స్ట్రీమింగ్

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. దీనికి అవార్డులు కూడా వచ్చాయి. మరి ఇలాంటి అవార్డు విన్నింగ్ ఫీల్ గుడ్ మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే కదా. ఈ సినిమా పేరు “8 ఏఎం మెట్రో” (8 AM Metro). ప్రస్తుతం ఈ సినిమా జీ5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతుంది.

కథలోకి…

Advertisement

ఇందులో హీరోయిన్ కు బుక్స్ చదవడం కథలు రాయడమంటే చాలా ఇష్టం. కానీ ఇంట్రోవర్ట్ గా ఉండడం వల్ల తనకు సంబంధించిన విషయాలు భర్తతో ఎప్పుడూ చెప్పదు. అతను కూడా బిజీగా ఉండడంవల్ల ఆమె గురించి పెద్దగా పట్టించుకోడు. అయితే ఓ రోజు సడన్ గా తన చెల్లి నుంచి ఫోన్ వస్తుంది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆస్పత్రిలో ఉన్నానని ఫోన్ చేయగా, అక్కడికి వెళ్దామంటూ హీరోయిన్ తన భర్తని అడుగుతుంది. కానీ భర్త నేను బిజీగా ఉన్నాను నువ్వు మాత్రమే వెళ్ళు అనడంతో  ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతుంది. అయితే చాలామంది బయట ప్రయాణిస్తున్నారు భయపడాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెప్పి పంపిస్తాడు. అయినప్పటికీ నిరాశ చెందిన హీరోయిన్ భయపడుతూనే వెళుతుంది. మొత్తానికి హాస్పిటల్ లోకి వెళ్లేసరికి డాక్టర్ ఎవరో ఒకరు ఆమె దగ్గర ఉండి తీరాల్సిందేనని చెప్తుంది. చేసేదేం లేక ప్రతిరోజూ మెట్రోలో వచ్చి పోవాలని హీరోయిన్ డిసైడ్ అవుతుంది. అయితే తిరిగి వెళ్లే క్రమంలో ఆమెకు మెట్రో ను చూడగానే చెమటలు పట్టేస్తాయి. భయంతో కదలని పరిస్థితిలో ఉన్న హీరోయిన్ ని ప్రీతం అనే వ్యక్తి ఓదార్చి ట్రైన్ లో ఎక్కిస్తాడు.

ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారుతుంది. హీరో తన వైఫ్ పిల్లల గురించి చాలా విషయాలు చెప్తాడు. అలాగే హీరోయిన్ కూడా తన గురించి ఓపెన్ అవుతుంది. నిజానికి అప్పటిదాకా తనతో అంత ఫ్రెండ్లీగా ఎవరూ లేకపోవడంతో హీరోతో క్లోజ్ గా మూవ్ అవుతుంది.  ఒకరోజు హీరోయిన్ పుట్టినరోజు ఉండగా పిల్లలు ఫోన్ చేసి విష్ చేస్తారు కానీ భర్త మాత్రం ఫోన్ చేయడు. పైగా తను  ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను అంటూ పెట్టేస్తాడు. హీరోయిన్ బర్త్ డే విషయం తెలుసుకున్న ప్రీతం ఆమెను తీసుకెళ్లి హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ చెల్లి తన భర్త తనను మోసం చేశాడంటూ హీరోయిన్ దగ్గర ఏడుస్తుంది. నువ్వు కూడా ట్రైన్లో పరిచయమైన ఆ వ్యక్తిని అంతగా నమ్మొద్దు అంటూ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు హీరో హీరోయిన్ ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. కానీ తీరా ఇంటికి వెళ్లి చూసేసరికి అతని భార్య పిల్లలు బయటకు వెళ్తున్నట్టుగా లెటర్ రాసిపెట్టి ఉంటుంది. మరి ప్రీతం భార్య పిల్లలు ఎక్కడికి వెళ్లారు? హీరోయిన్ ని అతను ఎందుకు ఇంటికి ఆహ్వానించాడు? చివరికి వీళ్లిద్దరి రిలేషన్ గురించి హీరోయిన్ భర్తకు తెలిసిందా? క్లైమాక్స్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ డోంట్ మిస్.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×