E-Paper
Advertisement

OTT Content : ఓటీటీ కంటెంట్ లో వేలు పెట్టొద్దు… సెన్సార్ బోర్డుకు సెంట్రల్ గవర్నమెంట్ చెక్

OTT Content : ఓటీటీ కంటెంట్ లో వేలు పెట్టొద్దు… సెన్సార్ బోర్డుకు సెంట్రల్ గవర్నమెంట్ చెక్
Advertisement

OTT Content : ఓటీటీలలో రోజురోజుకీ పెరిగిపోతున్న అభ్యంతరకర సన్నివేశాల ఆరాచకానికి అడ్డు కట్ట వేయాలనే టాక్ ఎప్పటి నుంచో విన్పిస్తోంది. మరికొంత మంది ఓటీటీ కంటెంట్ ను కూడా సెన్సార్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ తాజాగా ఓటీటీ కంటెంట్ అసలు సెన్సార్ పరిధిలోకి రాదని కేంద్రం తేల్చి చెప్పింది. మరి ఈ అభ్యంతర సన్నివేశాలకు ప్రభుత్వం ఎలా అడ్డుకట్ట వేయబోతోంది ? అంటే దానికి కూడా సమధానం ఉంది.

ఓటీటీని కంట్రోల్ చేసేది వాళ్ళే

డిసెంబర్ 17 బుధవారం రోజు సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ భారతదేశంలోని OTT కంటెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అధికార పరిధిలోకి రాదని పేర్కొంది. డిజిటల్ రంగంలోని కంటెంట్ ప్రస్తుత సమాచార సాంకేతిక నియమాల ప్రకారం విడిగా కంట్రోల్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు – డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021లోని పార్ట్ III కింద కంట్రోల్ లో ఉండబోతున్నాయి. ఈ రూల్స్ ప్రకారం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు చట్టం ద్వారా నిషేధించబడిన ఏ కంటెంట్‌ను హోస్ట్ చేయకూడదనే రూల్ కు కట్టుబడి ఉండాలి. అలాగే ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫామ్‌లు సూచించిన వయస్సు ఆధారంగా కంటెంట్ ను సెపరేట్ చేయాలనే నిబంధనలను కూడా పాటించాలి.

Advertisement

Read Also : నెట్ ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న 2 గంటల 28 నిమిషాల పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్… IMDbలో అదిరిపోయే రేటింగ్

రూల్స్ తప్పితే ఇదే గతి

అశ్లీలతను అరికట్టడం… మహిళలు, పిల్లలు సహా వినియోగదారులకు ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్రం కొన్ని రూల్స్ ను లిస్ట్ చేసింది. 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు స్థానిక అధికారులను నియమించడం, సమ్మతి నివేదికలను (publish compliance reports) ప్రచురించడం తప్పనిసరి చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలోని ఓటీటీ కంటెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిధిలోకి రాదని, కానీ ఐటీ నిబంధనల ప్రకారం నియంత్రించబడుతుందని మంత్రి మురుగన్ పార్లమెంటుకు తెలిపారు.

Advertisement

బుధవారం మధ్యాహ్నం సమాచార – ప్రసార శాఖ జూనియర్ మంత్రి ఎల్ మురుగన్ లోక్‌సభలో ఇచ్చిన దీనిపై మాట్లాడుతూ ఇంటర్నెట్‌లో చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌ను ఎదుర్కోవడానికి ఐటీ చట్టం, ఐటీ నియమాలు కలిసి కఠినమైన చట్రాన్ని రూపొందించాయని అన్నారు. అలాగే కంటెంట్ ను కంట్రోల్ లో ఉంచడానికి, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఓటీటీలు మూడు అంచెల యంత్రాంగాన్ని కలిగి ఉండాలన్న రూల్ ఉంది. మొదటి స్థాయి ప్లాట్‌ఫారమ్ ద్వారా స్వీయ-నియంత్రణ, రెండవది ప్లాట్‌ఫారమ్‌ల స్వీయ-నియంత్రణ సంస్థల పర్యవేక్షణ, మూడవది కేంద్రం పర్యవేక్షణ. ఇక ఇప్పటికే అభ్యంతరక కంటెంట్‌ను ప్రదర్శించినందుకు 43 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను కేంద్రం నిలిపివేసిందని మంత్రి తెలిపారు.

చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను 72 గంటల్లోపు తొలగించడం ద్వారా ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. “గోప్యతను ఉల్లంఘించడం, ఇతర వ్యక్తుల్లా నటించడం లేదా అసభ్యకర సన్నివేశాలను చూపించడం” వంటి కంటెంట్ ఉంటే 24 గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. ఐటీ రూల్స్ 2021లో అందించిన చట్టపరమైన బాధ్యతలను మధ్యవర్తులు పాటించకపోతే… ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద చట్టపరమైన పర్యవసానాలు ఫేస్ చేయాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. అశ్లీలమైన, పిల్లలకు హానికరమైన, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే లేదా ఏదైనా చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేయడాన్ని ఐటీ రూల్స్ అడ్డుకుంటాయని ఆయన అన్నారు. మోసం చేసే లేదా తప్పుదారి పట్టించే డీప్‌ఫేక్‌లు, ఇతరులను అనుకరించడానికి AIని ఉపయోగించే కంటెంట్ కూడా పరిమితం చేయబడింది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×