E-Paper
Advertisement

OTT Movie : పిచ్చిగా ప్రేమిస్తే పిచ్చోడిని చేసింది… ఈ అందం వెనుక చాలా అపాయం ఉంది భయ్యా

OTT Movie : పిచ్చిగా ప్రేమిస్తే  పిచ్చోడిని చేసింది… ఈ అందం వెనుక చాలా అపాయం ఉంది భయ్యా
Advertisement

OTT Movie : మోసాలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో ప్రేమ పేరుతో చేసే మోసాలు చాలా ఘోరంగా ఉంటాయి. మోస పోయినోడు మాత్రం కోలుకోవడం చాలా కస్టం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో డబ్బున్న వ్యక్తిని, ప్రేమ పేరుతో మోసం చేసే కిలాడి లేడీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో అందాల భామ ఏంజెలీనా జోలీ తన అందాలతో కనువిందు చేసింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘ఒరిజినల్ సిన్’ (Original sin). ఆంటోనియో బాండెరాస్ , ఏంజెలీనా జోలీ నటించిన ఈ  రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని కార్నెల్ వూల్‌రిచ్ రచించిన వాల్ట్జ్ ఇంటు డార్క్‌నెస్ అనే నవల ఆధారంగా రూపొందించారు. ఇది 1969 నాటి ఫ్రాంకోయిస్ ట్రూఫాట్ మూవీ మిస్సిస్సిప్పి మెర్‌మైడ్‌కి రీమేక్ గా వచ్చింది. నటి మిచెల్ ఫైఫర్ నిర్మాణ సంస్థ వయా రోసా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

మైఖేల్ పెళ్లి చూపులకు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ ఫోటోలు చూపించిన విధంగా కాకుండా, మరో రూపంలో ఉన్న అమ్మాయి కనపడుతుంది. ఆమె నేనే ఆ విధంగా ఫోటోను పంపించాను అని చెప్తుంది. తన అందాన్ని చూసే వాడు కాకుండా, మనసును చూసి ప్రేమించేవాడు కావాలని చెప్తుంది. తన మాటల్లో నిజం ఉందని ఆమెను ఇష్టపడి పెళ్లి కూడా చేసుకుంటాడు మైఖేల్. ఆ తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి మహారాణిలా చూసుకుంటాడు. తన బ్యాంక్ అకౌంట్ ని కూడా ఆమెకు లింక్ చేస్తాడు. అలా కొద్ది రోజుల్లోనే ఆమె మైఖేల్ దగ్గర ఉన్న డబ్బును తీసుకొని పారిపోతుంది. ఈ మోసాన్ని భరించలేని మైఖేల్ తాగుడుకు బానిస అవుతాడు. ఆ తర్వాత ఒక ప్రాంతంలో ఆమెను కనిపెడతాడు. అక్కడ మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉంటుంది. ఆ తర్వాత నన్ను ఎందుకు మోసం చేశావని గట్టిగా నిలదీస్తాడు మైఖేల్. నా మొదటి భర్త వేధించడంతో ఆ డబ్బులు కూడా ఇచ్చేశానని చెప్తుంది జూలియా.

నిజానికి జూలియాకి ఇదివరకే పెళ్లి జరిగి ఉంటుంది. డబ్బున్న వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉంటారు ఈ జంట. వీళ్ళ ఉచ్చులో పడ్డవాడే మైఖేల్. ఆ తర్వాత కూడా మైఖేల్ తనని ప్రేమిస్తాడు. ఈసారి ఎక్కడికైనా వెళ్లి బతుకుదామని ఆమెను తీసుకొని వెళ్తాడు. తన ఆస్తులన్నీ అమ్మి డబ్బు కూడా తెస్తాడు. ఆ డబ్బులు కూడా కొట్టేసి పారిపోవాలని చూస్తుంది జూలియా. అప్పుడే మైకేల్ కి విషయం తెలుస్తుంది. జూలియా తన భర్తతో ఇదంతా ప్లాన్ చేస్తోందని. ప్లాన్ చేయడమే కాదు మైఖేల్ ని చంపడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు వీళ్ళు. చివరికి మైఖేల్ ని ఆ జంట చంపుతుందా? ఆ డబ్బులు తీసుకుని పారిపోతారా? జూలియా మనసు మారుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ‘ఒరిజినల్ సిన్’ (Original sin) అనే  ఈ మూవీని చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×