E-Paper
Advertisement

OTT Movie: భార్య ఉండగా ప్రియురాలికి ప్రేమ లేఖలు… ఫ్రెండు భార్యతో అలాంటి వ్యవహారం … ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్

OTT Movie: భార్య ఉండగా ప్రియురాలికి ప్రేమ లేఖలు… ఫ్రెండు భార్యతో అలాంటి వ్యవహారం … ఫ్యూజులు అవుటయ్యే  క్లైమాక్స్
Advertisement

OTT Movie : గ్రామీణ జీవితం, ప్రేమ, మోసాలు, ఫ్యామిలీ బాండింగ్ మిక్స్ చేసే ఎమోషనల్‌ స్టోరీ కావాలా? అయితే ఈ బెంగాలీ మూవీ చూడాల్సిందే. గ్రామంలో ప్రేమ ఇలా ఉంటుందా అని మైండ్ రొటేట్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ ముకుల్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. డబ్బు సంపాదించడానికి వచ్చిన ఇతను ఒక విచిత్రమైన లవ్ స్టోరీ రన్ చేస్తాడు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ కి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఈ స్టోరీ చెప్పేకంటే చూస్తేనే చక్కగా ఉంటుంది. రియలిస్టిక్ గా అనిపించే ఈ స్టోరీ హార్ట్ ని టచ్ చేస్తుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ….

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

విక్కీ జాహెద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పేరు ‘ఒంధోకారేర్ గాన్’ (Ondhokarer Gaan). ఇందులో మొషార్రఫ్ కరీం, జాకియా బారీ మోమో, రాష్డ్ మమూన్ ఆపు, అబుల్ హయాత్ మెయిన్ రోల్స్ లో నటించారు. ఇది 2025 జనవరి 8 నుంచి Binge ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 120 నిమిషాల నిడివితో ఐయండిబిలో 7.0/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ముకుల్ అనే వ్యక్తి తన ఫ్యామిలీకి సపోర్టింగ్ కోసం పట్టణానికి షిఫ్ట్ అవుతాడు. అతని ఫ్యామిలీలో అమ్మ, నాన్న భార్యా పిల్లలు కూడా ఉండటంతో డబ్బు బాగా అవసరం అవుతుంది. దీంతో పట్టణంలో ఒక కేర్ టేకర్ గా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అక్కడ పని చేస్తూ, తన ఫ్యామిలీకి డబ్బు పంపి సపోర్ట్ చేస్తాడు. కానీ అతని మనసులో మార్పు వస్తుంది. అదే ఊరిలో షీలా అనే గార్మెంట్ వర్కర్‌పై ప్రేమలో పడతాడు ముకుల్. షీలా చాలా సింపుల్, హార్డ్ వర్కింగ్ అమ్మాయి. ఆమెకు కూడా ఇదివరకే పెళ్లి జరిగి ఉంటుంది. భర్త వేరే ఊరిలో పని చేస్తుంటాడు. అయితే ముకుల్ ఆమెను డైరెక్ట్ గా కలవకుండా లెటర్లను పంపుతూ తన ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. ఆమెకు గిఫ్టులు కూడా పంపుతుంటాడు.

Read Also : కేసులు లేని డిటెక్టివ్… కుక్క కేసుతో యాక్షన్ షురూ … ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ

ఇక అతని జీతం ఆమెకు కూడా ఖర్చు పెడుతుండటంతో ఇంటికి పంపే డబ్బును తగ్గిస్తాడు. ఇలా అతని జీవితం సాగుతూ ఉంటుంది. ఒక రోజు వీళ్ళు పేస్ టూ ఫేస్ కలవాలని అనుకుంటారు. వీళ్ళు కలుసుకోవడానికి చాలా అడ్డంకులు వస్తాయి. తీరా కలిసాక అందరూ షాక్ అయ్యే ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ లో ముకుల్ ఫ్యామిలీ, షీలా భర్త గురించి షాకింగ్ సీక్రెట్స్ రివీల్ అవుతాయి. ఈ దెబ్బతో ఆడియన్స్ కి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? వీళ్ళు కలిసాక ఏం జరుగుతుంది ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×