E-Paper
Advertisement

NTR Devara: నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ రికార్డు.. భవిష్యత్తులో ఏ హీరోకైనా సాధ్యమా..?

NTR Devara: నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ రికార్డు.. భవిష్యత్తులో ఏ హీరోకైనా సాధ్యమా..?
Advertisement

NTR Devara: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం తర్వాత.. సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్టీఆర్ (NTR).భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.370 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్ళు వచ్చాయి. ‘ఆచార్య’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ప్లాఫ్ సినిమా చవిచూసిన కొరటాల శివ, ఆ తర్వాత పట్టుదలతో ఈ సినిమా చేసి మంచి కం బ్యాక్ అందుకున్నారు.

ఈ సినిమా విడుదలైన నెల రోజుల వరకు అద్భుతమైన థియేట్రికల్ వసూలు లభించిందని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆది, సింహాద్రి సినిమాల తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లో మంచి లాంగ్ రన్ ను తెచ్చుకున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసి, ఇప్పటికే 50 రోజులు పూర్తయింది. ఈ 50 రోజుల నుండి కూడా ఈ సినిమా టాప్ టెన్ లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ముందుగా హిందీ వర్షన్ ని ఆపి, మిగిలిన ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి హిందీ వర్షన్ ఆడియో ని కూడా జత చేయడం జరిగింది.

Advertisement

ఇకపోతే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకు తెలుగులో వచ్చిన వ్యూస్ కంటే హిందీలో వచ్చిన వ్యూస్ అధికమని చెప్పాలి. అదే విధంగా ఈ చిత్రాన్ని అక్కడి ఆడియన్స్ థియేటర్స్ లో కంటే ఓటీటీ లోనే ఎక్కువగా చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుండడంతో మేకర్స్ కూడా రీసెంట్గా ఇంగ్లీష్ వర్షన్ ఆడియోని కూడా జతచేయడం జరిగింది. దీంతో రెస్పాన్స్ ఇంకా పెరిగిపోయింది. త్వరలోనే ఇతర దేశాలకు సంబంధించిన భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. నెట్ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ 5 చిత్రాలలో ఈ సినిమా నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన సినిమాలన్నీ కూడా హాలీవుడ్ చిత్రాలు కావడం గమనార్హం. ఏకంగా అన్ని చిత్రాల మధ్య ఒకే ఒక్క తెలుగు సినిమా ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పడానికి ఉదాహరణ దేవరా అని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది దేవర. మరి ఈ రికార్డుని భవిష్యత్తులో మరే సినిమా అయినా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×