E-Paper
Advertisement

Thriller Movie In OTT : మెంటలెక్కించే సస్పెన్స్.. ఊహకు అందని క్లైమాక్స్..నెవ్వర్ బిఫోర్ మూవీ..!

Thriller Movie In OTT : మెంటలెక్కించే సస్పెన్స్.. ఊహకు అందని క్లైమాక్స్..నెవ్వర్ బిఫోర్ మూవీ..!
Advertisement

Thriller Movie In OTT : ఈ మధ్యకాలంలో వస్తున్న థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఊహకు అందని సస్పెన్స్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. థియేటర్లలో సక్సెస్ అయిన అవ్వకపోయినా కూడా ఓటీటీలో మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు 7.6 IMDb రేటింగ్‌తో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ థ్రిల్లర్‌లలో ఒకటి.. స్టోరీ మొదలైనప్పటి నుంచి క్షణక్షణం ఉత్కంఠ గా సాగే వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.. ఈ వెబ్ సిరీస్ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

వెబ్ సిరీస్ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ఇదొక తమిళ వెబ్ సిరీస్.. మొత్తం 7 ఎపిసోడ్‌లు, చాలా ఆసక్తికరమైన కథను కలి ఉన్న ఈ సిరీస్ నిడివి దాదాపు 30-52 నిమిషాల మధ్య ఉంటుంది.. ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించిన సిరీస్ ‘నవంబర్ స్టోరీ’.. ఇది తమిళ క్రైమ్ వెబ్ సిరీస్ అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 2021లో ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో అను పాత్రలో తమన్నా నటించింది. ఈ పాత్ర చుట్టే మొత్తం వెబ్ సిరీస్ స్టోరీ ఉంటుంది. ఒకప్పుడు ప్రసిద్ధ క్రైమ్ నవల రచయిత అయిన ఆమె తండ్రి గణేషన్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంటాడు.

ఒక రోజు గణేషన్ హత్య జరిగిన ప్రదేశంలో రక్తంతో తడిసిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉంటాడు. ఆ తర్వాత నుంచి ఈ స్టోరీ ఆసక్తిగా మారుతుంది.. తండ్రి నీ నిర్దోషిగా నిరూపించేందుకు అను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అను కూడా తన తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ట్రై చేస్తుంది. ఆమె తన తండ్రి గతాన్ని తెలుసుకుంటుంది. కానీ అదే సమయంలో ప్రమాదకరమైన రహస్యాలను కనుగొంటుంది. ప్రతి ఎపిసోడ్‌ రహస్యం మరింత క్లిష్టంగా మారుతుంది. చివరికి తన తండ్రి నిర్దోషిని అను నిరూపించిందా? లేదా? అన్నది ఈ స్టోరీలో చూడాల్సిందే..

Advertisement

Also Read : ఈ వారం ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు.. ఆ ఒక్కటి మిస్ చెయ్యకండి..

జియో హాట్ స్టార్ ( Jio Hotstar).. 

మైండ్ బ్లాక్ అయ్యే స్టోరీతో ఊహకందని మలుపులు తిరుగుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీలకు పై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ వెబ్ సిరీస్ ని ఇక్కడ చూసి ఎంజాయ్ చేయొచ్చు.. ఈమధ్య జియో హాట్ స్టార్ కొత్త సినిమాలు తో పాటు హారర్ సినిమాలను ఎక్కువగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. భయంకరమైన సీన్లని చూడాలి అనుకునే వారికి ఈ ఫ్లాట్ ఫామ్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. మీకు నచ్చిన సినిమాలని ఇక్కడ చూసి ఆనందించండి..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×