E-Paper
Advertisement

Nithin Thammudu : నితిన్ ‘తమ్ముడు ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. ఎక్కడ రానుందంటే..?

Nithin Thammudu : నితిన్ ‘తమ్ముడు ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. ఎక్కడ రానుందంటే..?
Advertisement

Nithin Thammudu : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు గత నాలుగేళ్లుగా నితిన్ ఖాతాలో హిట్ సినిమా పడలేదు. రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ మూవీ కూడా నిరాశపరిచింది.. ప్రస్తుతం నితిన్ తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ పైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా టైటిల్ కావడంతో అటు నితిన్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే జూలై 4 న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏ ఫ్లాట్ ఫామ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఆ ఓటీటీలోకే ‘తమ్ముడు’..!

Advertisement

ఈ మూవీ డిజిటల్ హక్కుల పై ఆసక్తికర న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీపై అంచనాలు బాగానే ఉండడంతో మంచి ధరకే సొంతం చేసుకుందని తెలుస్తోంది.. అతి త్వరలోనే ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ ను ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం నగర్లో టాక్.. తమ్ముడు చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెడుతుంది. జూలై 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే మూవీ టాక్ ను బట్టి స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసే అవకాశం ఉంది.. ఆగష్టులో మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందని సమాచారం..

Also Read :మళ్ళీ బన్నీని పక్కపెట్టేసిన త్రివిక్రమ్.. ఈ సారి ఈ హీరోతో కానిస్తున్నాడా?

Advertisement

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

తమ్ముడు మూవీని వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. అక్కాతమ్ముళ్ల బంధం, యాక్షన్ ఈ మూవీలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రమాదాల నుంచి అక్కను కాపాడేందుకు ఏమైనా చేసే తమ్ముడి చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉండనుందని టాక్.. ఈ మూవీలో నితిన్ కు జోడిగా కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ నటిస్తుంది.. నితిన్ కు అక్కగా సీనియర్ హీరోయిన్ లయ నటిస్తుంది. ఈ మూవీ తర్వాత లయ బిజీ అవుతుందేమో చూడాలి.. సౌరభ్ సచ్‍దేవ, వర్ష బొల్లమ్మ, స్వస్తిక ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. భీష్మ తర్వాత మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు నితిన్. ఈ మూవీ హిట్ అయితే నితిన్ జాక్ పాట్ కొట్టినట్లే.. చూడాలి ఏం జరుగుతుందో.. ఇటీవల రిలీజ్ అయిన టీజరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ టీజర్ ను చూస్తుంటే మాస్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయని అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి టైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×