E-Paper
Advertisement

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా
Advertisement

OTT Movie : ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది జంతువుల జీవితాన్ని హారర్ సినిమాలా చూపిస్తుంది. సాధారణ డాక్యుమెంటరీలా కాకుండా, ఈ సిరీస్ ప్రకృతిలోని భయంకరమైన విషయాలను ఉత్కంఠగా, భయపెట్టే విధంగా చూపిస్తుంది. ఈ సిరీస్ జంతువుల పోరాటాన్ని ఒక థ్రిల్లర్ సినిమాలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఈ సిరీస్‌లో జంతువుల జీవితంలోని నిజమైన సంఘటనలను తీసుకుని, వాటిని భయంకరంగా, సినిమాటిక్‌గా చూపించడం జరిగింది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘నైట్‌మేర్స్ ఆఫ్ నేచర్’ (Nightmares of Nature) 2025లో విడుదలైన అమెరికన్ హారర్ సై-ఫై డాక్యుమెంటరీ మినీ సిరీస్. దీనిని బ్లమ్‌హౌస్ టెలివిజన్, ప్లిమ్సాల్ ప్రొడక్షన్స్ కలసి నిర్మించాయి. ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. 3 ఎపిసోడ్‌లతో (ప్రతి ఎపిసోడ్ 44 నిమిషాలు) IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది. సీజన్ 2, 2025 అక్టోబర్ లో విడుదల కానుంది.

సీజన్ 1 – (క్యాబిన్ ఇన్ ది వుడ్స్)

Advertisement

మొదటి సీజన్‌లో మూడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. అవి ఉత్తర అమెరికా అడవుల్లో జరుగుతాయి. కథలో మూడు జంతువులు, ఒక ప్రెగ్నెంట్ ఎలుక, ఒక చిన్న రాకూన్, ఒక కప్ప పిల్ల ప్రధాన పాత్రలుగా ఉన్నాయి. ఈ జంతువులు అడవిలో భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. తోడేళ్లు, గుడ్లగూబలు, ఇతర జంతువులు వీటిని వేటాడుతుంటాయి. ఈ సమయంలో ఒక రాత్రి భారీ వర్షం వస్తుంది. దీంతో ఈ మూడు జంతువులు ఒక పాడుబడిన క్యాబిన్‌లో దాక్కుంటాయి. కానీ ఈ క్యాబిన్ కూడా అనుకున్నంత సేఫ్టీ ఉండదు. వర్షం, చీకటి, బయట ఉన్న జంతువులు ఈ క్యాబిన్‌ను ఒక ఉచ్చులా మారుస్తాయి. ఎలుక, రాకూన్, కప్ప పిల్ల భయంతో వణికిపోతుంటాయి. ఒక్కో జంతువు తనదైన రీతిలో బయటపడేందుకు పోరాడుతుంది. కానీ అడవిలోకి తిరిగి వెళ్లాలంటే మరిన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. కథ చివర్లో ఈ జంతువులు ప్రాణాలతో బయటపడతాయా ? అనేది ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

సీజన్ – 2 (లాస్ట్ ఇన్ ది జంగిల్)

సెంట్రల్ అమెరికా రెయిన్‌ఫారెస్ట్‌లో జరుగుతుంది. ఇది అక్టోబర్ 2025 చివర్లో విడుదలవుతుంది. ఇందులో కొత్త జంతువులు ప్రధాన పాత్రలు పోషిస్తాయి. ఇవి భయంకరమైన వాంపైర్ ఫిష్, కీటకాలు, మాంసాన్ని తినే చెట్ల వంటి ప్రమాదాలను ఎదుర్కొంటాయి. ఈ సీజన్ కూడా జంతువుల బతుకు పోరాటాన్ని, ఒక హారర్ సినిమాలా చూపిస్తుంది. ఇందులో ప్రతి జంతువు తన శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, బతకడానికి చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా ఉంటాయి.

Advertisement

Read Also : చావడానికెళ్లి సీరియల్ కిల్లర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యే అమ్మాయి… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×