E-Paper
Advertisement

Netflix Movies : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న టాప్ 5 బెస్ట్ హిందీ థ్రిల్లర్లు… నిమిషానికో ట్విస్ట్ తో నరాలు కట్టయ్యే సస్పెన్స్

Netflix Movies : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న టాప్ 5 బెస్ట్ హిందీ థ్రిల్లర్లు… నిమిషానికో ట్విస్ట్ తో నరాలు కట్టయ్యే సస్పెన్స్
Advertisement

Netflix Movies : అదిరిపోయే కంటెంట్ తో కొత్త కొత్త సినిమాలను అందించడంలో, నెట్‌ఫ్లిక్స్ ఒక అడుగు ముందే ఉంటుంది. వీకెండ్ లో సిరీస్‌లు, సినిమాలను చూడటానికి ప్రజలు ఈ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ను ఎక్కువగా కోరుకుంటారు. ఇక సస్పెన్స్ జానర్ సినిమాలకి ఈ ఓటీటీ బాగా ప్రజాదరణ పొందింది. థ్రిల్లర్  సినిమాలను చూడటానికి ఆసక్తి ఉంటే మాత్రం, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలను అస్సలు మిస్ కావద్దు. ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ తారలు నటించిన సినిమాలు ఉన్నాయి. ఇవి మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు. ఈ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

జిగ్రా (Jigra)

మీరు ఇంట్లోనే ఉండి ఒక ఉత్కంఠభరితమైన కథను నిజంగా ఆస్వాదించాలనుకుంటే, అలియా భట్ నటించిన ఈ సినిమాను చూడాల్సిందే.  ఊరి శిక్ష పడ్డ తన తమ్ముడిని రక్షించుకునే క్రమంలో ఈ కథ ఉంటుంది. 2024 డిసెంబర్ 6 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

దో పట్టి (Do Patti)

Advertisement

ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో కాజోల్, కృతి సనన్ నటించారు. ఉత్తరాఖండ్ నేపథ్యంలో సాగే ఈ కథ ఇద్దరు కవల సోదరీమణుల మధ్య తిరుగుతుంది. పోలీసు ఇన్వెస్టిగేషన్, ఊహించని ట్విస్ట్లు ఉంటాయి.

సికందర్ కా ముఖద్దర్ (Sikandar Ka Muqaddar)

‘సికందర్ కా ముఖద్దర్’ సినిమా కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు బోర్ అనిపించదు. వారాంతంలో మీరు ఈ సస్పెన్స్ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. ఒక అన్‌సాల్వ్డ్ డైమండ్ హీస్ట్ తర్వాత, ఒక పోలీస్ అధికారి క్రిమినల్ ని ఎదుర్కొనే హై-టెన్షన్ హీస్ట్ థ్రిల్లర్ ఇది. 2024 నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

సెక్టార్ 36 (Sector 36)

Advertisement

ఈ జాబితాలో ‘సెక్టార్ 36’ కూడా ఉంది. విక్రాంత్ మాస్సే నటించిన ఈ చిత్రానికి చాలా ప్రశంసలు లభించాయి. సెక్టార్ 36లో పలువురు పిల్లలు అదృశ్యమవ్వడం, సీరియల్ కిల్లర్ హస్తం ఉండటం, ఒక కరప్ట్ పోలీస్ అధికారి ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం వంటివి చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఇది ఒక చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్. ఇది 2024 సెప్టెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

దృశ్యం (Drishyam)

అజయ్ దేవగన్ హిట్ ఫ్రాంచైజ్ చిత్రం దృశ్యం కూడా భారీ విజయాన్ని సాధించింది. మీరు ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో కూడా చూడవచ్చు. ఒక సాధారణ కుటుంబం క్రైమ్ లో ఇరుక్కోకుండా తమని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ కథ. పోలీస్ దర్యాప్తు మధ్య సాగే మాస్టర్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇది ఇప్పటికీ టాప్ రేటెడ్ లో ఒకటి. ఈ సినిమాలన్నీ సస్పెన్స్, ట్విస్ట్స్, గొప్ప పెర్ఫార్మెన్స్‌లతో ఉన్నాయి. వీకెండ్ లో నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి ఎంజాయ్ చేయండి.

Read Also : చచ్చినా వదలని భర్త… ముసలావిడను చూసుకోవడానికి వెళ్తే మతిపోగొట్టే ట్విస్టులు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×