E-Paper
Advertisement

Suriya 47 OTT: సూర్య 47 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. ఎన్ని కోట్లకో తెలుసా?

Suriya 47 OTT: సూర్య 47 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. ఎన్ని కోట్లకో తెలుసా?
Advertisement

Suriya 47 OTT: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈయన ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఇటీవల మరొక కొత్త సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి మలయాళ చిత్ర దర్శకుడితో సూర్య సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి.

రూ.23 కోట్లకు డీల్ ఫిక్స్..

ఆవేశం సినిమాతో సంచలనాలను సృష్టించిన దర్శకుడు జిత్తు మాధవన్ (Jithu Madhavan) దర్శకత్వంలో సూర్య, నజ్రియా(Nazriya), నస్లెన్  ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకున్నదే ఆలస్యం అప్పుడే ఓటీటీ బిజినెస్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix)కైవసం చేసుకున్నారని తెలుస్తుంది .ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ హక్కులను 23 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన తరువాత వచ్చే ఆదరణ బట్టి మరింత పెంచే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.

నెట్ ఫ్లిక్స్ చేతికి సూర్య 47 సినిమా..

Advertisement

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ 23 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను ప్రారంభించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సుసిన్ శ్యాం సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. ఆవేశం లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సినిమా డైరెక్టర్ జిత్తు దర్శకత్వంలో సూర్య సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ చిత్ర బృందం అధికారకంగా వెల్లడించనున్నారు.

విడుదలకు సిద్ధంగా కరుప్పు…

Advertisement

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కరుప్పు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ తో పాటు జిత్తు మాధవన్ డైరెక్షన్లో ఉన్న సినిమా పనులలో కూడా సూర్య బిజీగా ఉన్నారు. ఇక సూర్య ఇటీవల పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈయన చివరిగా రెట్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

Also Read: Aadarsha Kutumbam: నందమూరి థమన్ ఇప్పుడు దగ్గుబాటి థమన్‌గా మారుతున్నాడా?
 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×