E-Paper
Advertisement

Nellikkampoyil Night Riders on OTT : ఓటీటీలోకి మరో మలయాళ కామెడీ హారర్… కడుపుబ్బా నవ్వించే సీన్స్ ఉన్న సినిమా

Nellikkampoyil Night Riders on OTT : ఓటీటీలోకి మరో మలయాళ కామెడీ హారర్… కడుపుబ్బా నవ్వించే సీన్స్ ఉన్న సినిమా
Advertisement

Nellikkampoyil Night Riders on OTT : మరో మలయాళ కామెడీ హారర్ సినిమా ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. ఇది బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ టాక్ తో నడిచింది. ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో ఆడియన్స్ కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో నివిన్ పౌలీ, రియా శిబు నటించిన హారర్ కామెడీ మలయాళ చిత్రం ‘సర్వం మాయ’ ను తెగ చూస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు లేటెస్ట్ గా మరో కామెడీ హారర్ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఒక దెయ్యం చుట్టూ ఈ కథ కూడా తిరుగుతుంది. మరి దీని పేరు ? ఎక్కడ చూడచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే

మాథ్యూ థామస్ నటించిన ఈ మలయాళ కామెడీ హారర్ సినిమా పేరు ‘నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’. నౌఫల్ అబ్దుల్లా దర్శకత్వం వహించిన ఈ తాజా హర్రర్ కామెడీ 2026 ఫిబ్రవరి 6 నుంచి Zee5లో ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. 2025 అక్టోబర్ 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దాదాపు మూడు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమ్ కి వచ్చింది. అయితే ఈ చిత్రం మలయాళ వెర్షన్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిళ్లతో అందుబాటులో ఉంటుంది. తెలుగులో మరికొంత సమయం పట్టవచ్చు. మాథ్యూ థామస్, రోషన్ షానవాస్, శరత్ సభ, విష్ణు అగస్త్య, మీనాక్షి ఉన్నికృష్ణన్ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నెల్లిక్కంపోయిల్ అనే గ్రామంలో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడ ప్రజలు ‘గుర్రపు కాళ్ళు’ కలిగిన ఒక మిస్టీరియస్ వ్యక్తి రాత్రి వేళల్లో తిరుగుతున్నాడని, వాడు కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందని గట్టిగా నమ్ముతుంటారు. ఆ ఊరిని భయపెడుతున్న ఈ మిస్టరీని ఛేదించడానికి శ్యామ్ (మాథ్యూ థామస్) తన స్నేహితులతో కలిసి రంగంలోకి దిగుతాడు. వీళ్ళు చేసే సాహసాలు, వాటి వల్ల వచ్చే కామెడీ ఓ పక్క భయపెడుతూనే, మరో పక్క కడుపుబ్బా నవ్విస్తాయి. స్టోరీ నడిచేకొద్దీ ఆ ఊరి ప్రాచీన పురాణాలు, మూఢనమ్మకాల వెనుక ఉన్న అసలు రహస్యం తెలిసి అందరూ షాక్ అవుతారు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ? గుర్రపు కాళ్ళతో భయపెడుతున్నది ఎవరు ? దీనిని శ్యామ్ టీం ఎలా ఛేదించారు. అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే

Read Also : దెయ్యంతో డీల్ మాట్లాడే తండ్రి… చెలరేగిపోయే పిశాచి…కూతురి ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ హారర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×