E-Paper
Advertisement

Ne Zha 2 OTT : ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ ఫాంటసీ యానిమేటెడ్ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ne Zha 2 OTT : ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ ఫాంటసీ యానిమేటెడ్ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Ne Zha 2 OTT : చైనీస్ యానిమేషన్ ‘నే ఝా 2’ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘నెజా’కు ఇది సీక్వెల్. బాక్సాఫీస్‌లో భారీ సంచలనం సృష్టించిన ఈ సీక్వెల్ ఇప్పుడు జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. 2026 ఫిబ్రవరి 20 నుంచి ఇంగ్లీష్, హిందీ, మాండరిన్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో గ్రాఫిక్స్, క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి.

ప్రపంచ రికార్డు సృష్టించిన యానిమేటెడ్

‘నే ఝా 2’ (Ne Zha 2) గత ఏడాది థియేటర్లలో విడుదలైన వెంటనే బాక్సాఫీస్‌లో భయంకరమైన కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $2.2 బిలియన్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. అద్భుతమైన CGI యాక్షన్ సీన్స్ డెవలప్‌మెంట్‌తో ప్రేక్షకులను మెప్పించింది. చైనీస్ పురాణాలు, దైవిక రాజకీయాలు వంటి థీమ్‌లను హైలైట్ చేస్తూ ఈ చిత్రం ఎవరినీ కదిలించకుండా కూర్చోబెడుతుంది. దీనిని జియావోజీ 16వ శతాబ్దపు నవల ‘ఇన్వెస్టిచర్ ఆఫ్ ది గాడ్స్ ఆధారంగా’ రూపొందించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి భాగం చివరలో నెజా, ఆవో బింగ్ ఇద్దరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఊరిని కాపాడతారు. ఆ తర్వాత వాళ్ళ శరీరాలు నశించి కేవలం ఆత్మలు మాత్రమే మిగులుతాయి. ఈ రెండో భాగంలో ఆ ఆత్మలు మళ్ళీ మనిషి రూపం దాల్చడానికి ‘అసెన్షన్ ట్రయల్’ అనే కష్టమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏడు రోజుల్లో జాడే ప్యాలెస్‌లో మూడు పరీక్షలు పూర్తి చేసి, అమృతాన్ని సంపాదించాలి. మాస్టర్ తైయి వాళ్ళ ఆత్మలను కాపాడటానికి ఏడు రంగుల పవిత్ర కమలాన్ని ఉపయోగిస్తాడు. కానీ దీంతో వీళ్ళ శరీరాలు బలహీనమవుతాయి. ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉండటంతో స్టోరీ ఆసక్తికరంగా మారుతుంది.

మరోవైపు డ్రాగన్ కింగ్ తన జాతికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఇందుకోసం ‘వులియాంగ్’ అనే ఒక శక్తివంతమైన శత్రువుతో చేతులు కలిపి పెద్ద కుట్ర పన్నుతాడు. లోకాన్ని నాశనం చేయాలనుకునే ఆ శత్రువులను నెజా తన మొండితనంతో, ఆవో బింగ్ తన తెలివితేటలతో ఎలా అడ్డుకున్నారు? విధి రాసిన రాతను నెజా తన పోరాటంతో ఎలా మార్చాడు? అన్నదే ఈ సినిమా అసలు కథ.

Advertisement

Read Also : తమిళ కామెడీ ‘లక్కీ ది సూపర్ స్టార్’ నుంచి మలయాళ చిత్రం ‘చాతా పచా’ వరకు… ఫిబ్రవరి 3వ వారం రిలీజ్ కానున్న సినిమాలు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×