E-Paper
Advertisement

OTT Movie : కలలో జరిగే హత్యలు నిజంగా జరిగితే … బార్ గర్ల్స్‌ నే టార్గెట్ చేసే సైకో … ట్విస్ట్ లతో అదరగొట్టే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : కలలో జరిగే హత్యలు నిజంగా జరిగితే … బార్ గర్ల్స్‌ నే టార్గెట్ చేసే సైకో … ట్విస్ట్ లతో అదరగొట్టే సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇందులో నచ్చిన సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా పోటీ పడుతూ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయికి జరగబోయే హత్యలు ముందే తెలిసిపోతుంటాయి. ఈ హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ స్టోరీ చివారివరకూ ఆసక్తికరంగా ఉంటుంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నజర్’ (Nazar). ఇందులో మీరా, అష్మిత్ పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. సోనీ రజ్దాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా పాకిస్థానీ నటి మీరాను బాలీవుడ్‌కి పరిచయం చేశారు. నాజర్ హారర్ చిత్రం అయినప్పటికీ, ఒక మ్యూజికల్ థ్రిల్లర్ గా రూపొందింది. అనూ మాలిక్, రూప్ కుమార్ రాథోడ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.  ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

దివ్య వర్మ ఒక పాప్ స్టార్‌ గా పేరు తెచ్చుకుంటుంది. దివ్య తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో చనిపోతారు. ఆ తర్వాత ఆమె ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఒక రోజు, షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా, రోడ్డు మీద ఒక శవాన్ని చూస్తుంది. ఆ క్షణం నుండి ఆమెకు భవిష్యత్తులో జరిగే దారుణమైన హత్యల దృశ్యాలు కనిపించడం మొదలవుతుంది. ఇదంతా ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.  ఈ హత్యలు ముంబైలోని బార్ గర్ల్స్‌ని లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ చేస్తున్నవిగా ఉంటాయి. దీని గురించి పోలీసులకు చెప్తుంది దివ్య.  ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసు అధికారి రోహన్ సేథీ, అతని సహాయకురాలు సుజాత దేశ్‌ముఖ్ దివ్య చెప్పిన మాటలను మొదట్లో నమ్మరు. కానీ ఆమె చెప్పిన హత్యలు నిజంగా జరగడంతో, వారు ఆమె మాటలను సీరియస్‌గా తీసుకుంటారు.

దర్యాప్తు ముందుకు సాగుతుండగా, ఆమె చెప్పినట్లే సమురాయ్ క్లబ్‌లో మరో హత్య జరుగుతుంది. ఇందులో దివ్య మామయ్య జగదీష్‌ని అనుమానితుడిగా అరెస్ట్ చేస్తారు. అయితే, దివ్యకి తనని హత్య చేస్తున్నట్లు కూడా దృశ్యాలు కనిపించడం మొదలవుతుంది. వీటిని చూసి ఆమె భయంతో వణకిపోతుంది. చివరికి నిజమైన ఆ కిల్లర్ ఎవరు? దివ్య ఈ హత్యల నుండి తప్పించుకోగలదా? ఆమెకు ఎందుకు హత్యలు ఇమాజినేషన్ అవుతున్నాయి ? హంతకుడు బార్ గర్ల్స్‌ ని లక్ష్యంగా హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మొరటి మొగుడు, అందమైన పెళ్ళాం … మరిది చేతికి చిక్కి … మెంటలెక్కించే మలయాళ మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×