E-Paper
Advertisement

Nayanam OTT Release : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్… 6-ఎపిసోడ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందంటే ?

Nayanam OTT Release : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్… 6-ఎపిసోడ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందంటే ?
Advertisement

Nayanam OTT Release : వరుణ్ సందేశ్ నటించిన ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్ ‘నయనం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆరు ఎపిసోడ్‌ల ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని సీట్ ఎడ్జ్ వరకు తీసుకెళ్తుంది. ఇటీవల విడుదలైన దీని ట్రైలర్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంది. 2 నిమిషాల, 18 సెకన్ల ట్రైలర్‌ ని చూశాక ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సిరీస్ మీద అంచనాలు కూడా పెరిగాయి. వరుణ్ సందేశ్ డార్క్ రోల్‌లో ఇంప్రెస్ చేస్తాడని ట్రైలర్ ఆధారంగా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మనిషి మెంటాలిటీ ఎలా మారుతుందో ఎక్స్‌ప్లోర్ చేస్తూ, ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఈ సిరీస్‌గా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలోకి వస్తుందంటే

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లోవచ్చిన ‘నయనం’ (Nayanam) సిరీస్ లో వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉత్తేజ్, అలీ రెజా, రేఖ నిరోష, హరీష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ మంత్రప్రగడ దర్శకత్వం వహించగా, కళ్యాణ్ కాగితపు స్క్రీన్‌ప్లే రాశారు. ZEE5 ఒరిజినల్ గా రూపొందిన ఈ సిరీస్ 2025 డిసెంబర్ 19న స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఇది ఆరు ఎపిసోడ్లతో సై-ఫై ఎలిమెంట్స్‌తో నడుస్తుంది.

Advertisement

Read Also : తెలుగులో ఇలాంటి సినిమానా ? మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన సినిమా

స్టోరీ ఏమిటంటే

డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) ఒక ప్రతిభావంతుడైన కంటి వైద్యుడు. పేదవాళ్లకు ఉచిత చికిత్సలు అందిస్తూ, రహస్యంగా అక్రమ ప్రయోగాలు చేస్తుంటాడు. ఈ ప్రయోగాల ద్వారా పేషెంట్ల కళ్ల లెన్సుల్లో అమర్చిన టెక్నాలజీతో వాళ్ల ప్రస్తుత జీవితాల్ని లైవ్ లో చూడగలుగుతాడు. మొదట సైంటిఫిక్ క్యూరియాసిటీగా మొదలైన ఈ అబిలిటీ, క్రమంగా ఆబ్సెషన్‌గా మారి, మర్డర్‌ల వరకు దారితీస్తుంది. దీని వల్ల అతని జీవితం ఒక భయంకరమైన ఉచ్చుగా మారుతుంది. పోలీసులు కూడా అతని కోసం వెతకడం మొదలు పెడతారు. ఇంతకీ ఇతరుల పర్సనల్ లైఫ్‌లోకి తొంగి చూడటం వల్ల నయన్ మనస్సు ఎలా మారిపోతుంది ? ఈ ఆబ్సెషన్ ఎంత దూరం తీసుకెళ్తుంది ? ఇవన్నీ సిరీస్‌ ను చూసి తెలుసుకోవాల్సిందే. చర్చిస్తారు. ఇందులో ప్రియాంక జైన్ పోషించిన మాధవి పాత్ర కూడా కీలకంగా మారుతుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×