// // Nawabpeta Devara Documentary :'నవాబుపేట దేవర' డాక్యుమెంటరీ -->
E-Paper
Advertisement

Nawabpeta Devara Documentary : “పొద్దుటూరు దసరా” డైరెక్టర్ కొత్త డాక్యుమెంటరీ… ఈసారి రాయలసీమ జాతర… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Nawabpeta Devara Documentary : “పొద్దుటూరు దసరా” డైరెక్టర్ కొత్త డాక్యుమెంటరీ… ఈసారి రాయలసీమ జాతర… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

Nawabpeta Devara Documentary : టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం డాక్యుమెంటరీల హవా నడుస్తోంది. ఓటిటి మూవీ లవర్స్ మన డైరెక్టర్స్ తీసే సిరీస్ లే కాదు డాక్యుమెంటరీలపై కూడా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘నవాబుపేట దేవర’ అనే టైటిల్ తో రూపొందిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. మరి ఈ డాక్యుమెంటరీ కథ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే…

నవాబుపేట దేవర స్టోరీ ఇదే

Advertisement

రీసెంట్ గా ‘ప్రొద్దుటూరు దసరా’ అనే డాక్యుమెంటరీ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ. ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, ప్రముఖుల నుంచి ప్రశంసలు కురిసాయి. తాజాగా డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ రూపొందించిన ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీన్ని పూజ కృష్ణ తుమ్మ, బిందుప్రియ సంయుక్తంగా నిర్మించారు. శనివారం సాయంత్రం ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీకి సంబంధించిన ప్రీమియర్ షో లను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి ప్రముఖ నటుడు మహేష్ విట్టా ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

రాయలసీమలో దేవర పండగను అచ్చం ఇలాగే జరుపుతారు అంటూ ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ చూసినా మహేష్ విట్టా డైరెక్టర్ మురళీకృష్ణ పై ప్రశంసలు కురిపించారు. అయితే రాయలసీమ నేపథ్యంలో ఎన్నో సినిమాలు చేసి చాలామంది గొప్ప పేరు తెచ్చుకున్నారని, కానీ రాయలసీమ డైరెక్టర్స్ మాత్రం సొంతగడ్డ కథలని రూపొందించి ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని ఆయన అన్నారు. రాయలసీమ నేటివిటీని సరిగ్గా చెప్పే సినిమా ఇప్పటిదాకా రాలేదని, అలాంటి బ్యాక్ డ్రాప్ తో సినిమా చేసి మురళి దర్శకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. రాయలసీమలో ‘దేవర’ పండగ జరిపే విధానాన్ని డాక్యుమెంటరీ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఈ జాతర జరిగిన రెండు రోజులు డైరెక్టర్ మురళీ అక్కడే ఉండి డాక్యుమెంటరీని రూపొందించారు.

Advertisement

స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే ?

ప్రీమియర్ చూసిన ప్రముఖులు ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’ను మించేలా ఉందని, ఇందులో మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ డాక్యుమెంటరీలో అమ్మవారిని ఏఐతో అద్భుతంగా చూపించారు. ఇక గతంలో డైరెక్టర్ మురళీకృష్ణ రూపొందించిన ‘పొద్దుటూరు దసరా ఈటీవీ’ అవుతుండగా, తాజాగా వచ్చిన ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ కూడా ఈటీవీ విన్లోనే స్ట్రీమింగ్ కాబోతోందని టాక్ నడుస్తోంది. దీనిపై మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది.

Read Also : తనూజను బెదరగొట్టిన శివాజీ… సీజన్ 10 ట్విస్ట్ తీసుకొచ్చిన శ్రీముఖి – ప్రదీప్… గాయపడ్డ కళ్యాణ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×