E-Paper
Advertisement

Nawab Cafe OTT : రాజీవ్ కనకాల కొత్త మూవీ మూడు వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Nawab Cafe OTT : రాజీవ్ కనకాల కొత్త మూవీ మూడు వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి…  స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

Nawab Cafe OTT : రాజీవ్ కనకాల నటించిన కొత్త వెబ్ సిరీస్ ‘D/O ప్రసాద్ రావు కనబడుటలేదు’. ఈ సిరీస్ లో తన నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ సిరీస్ ప్రస్తుతం ETV Win లో ప్రసారం అవుతోంది. ఈ ఉత్కంఠభరితమైన డ్రామాలో, రాజీవ్ కనకాల మిస్సింగ్ అయిన ఒక అమ్మాయి తండ్రిగా నటించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఉదయ్ భాను పోలీసు పాత్రలో సిరీస్ కి హైప్ తెచ్చింది. అయితే రాజీవ్ తండ్రి పాత్ర పోషించన మరో మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రాబోతోంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకి, ఓటీటీలో ఏమాత్రం రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఎక్కడ చూడచ్చు అంటే

శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా పేరు ‘నవాబ్ కేఫ్’. ఇది 2026 ఫిబ్రవరి 20న థియేటర్ లలో అడుగుపెట్టింది. ఇప్పుడు ETV Win ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. 2026 మార్చి 12 నుండి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే థియేటర్లలో విడుదలైన మూడు వారాల తర్వాత ఇది ఓటీటీలోకి వస్తోంది. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించిన ఈ కథ హైదరాబాద్‌లోని ఒక పురాతన కేఫ్ చుట్టూ తిరుగుతుంది. మొదటి ఈ సినిమాకు చాయ్‌ వాలా అని టైటిల్‌ పెట్టారు. కానీ సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం తెలపడంతో ‘నవాబ్‌ కేఫ్‌’గా మార్చారు.

కథ ఏమిటంటే

Advertisement

రంగనాథ్ (రాజీవ్ కనకాల) హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన ‘నవాబ్ కేఫ్’ని నడుపుతుంటాడు. ఆ కొట్టును ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తాడు. అయితే చదువుకున్న ఆయన కొడుకు రాజా(శివ కందుకూరి)కి మాత్రం ఆ కేఫ్‌లో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్ళే ఆలోచనలో ఉంటాడు. అలాగే సఖీ( తేజు అశ్విని) అనే అమ్మాయితో ప్రేమలో కూడా ఉంటాడు. ఒక రోజు ఆ కేఫ్‌ని అమ్మేయాలని ప్లాన్ కూడా వేస్తాడు. రంగనాథ్ కు ఈ విషయం తెలిసి కొడుకుతో గొడవ పడతాడు. ఇద్దరి మధ్య మాటా, మాటా పెరుగుతుంది. ఇక ఆ మరుసటి రోజు తెల్లారి నిద్ర లేవడు. అదేరోజు రాత్రి రంగనాథ్‌ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజా ఏం చేశాడు ? తన అమెరికా కల కోసం కేఫ్ ను అమ్మేశాడా? తండ్రి కోసం కేఫ్‌ని మళ్లీ రన్‌ చేశాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Read Also : మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×