E-Paper
Advertisement

72వ జాతీయ అవార్డుల్లో దుమ్మురేపిన సినిమా… ఇందులో అంతగా ఏముందంటే ?

72వ జాతీయ అవార్డుల్లో దుమ్మురేపిన సినిమా… ఇందులో అంతగా ఏముందంటే ?
Advertisement

Article 370 OTT: 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందులో ఏకంగా మూడు అవార్డ్స్ తో దుమ్మురేపింది ‘ఆర్టికల్ 370’ (Article 370) మూవీ. ఇండియన్ చరిత్రలోనే చారిత్రాత్మకమైన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ. మరి ఇంతకీ ఈ సినిమాలో నేషనల్ అవార్డును విన్ చేసేంత కంటెంట్ ఏముంది ? సినిమా స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఈ సినిమాను అసలు ఎందుకు చూడాలి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదం, రాజకీయ కుట్రల నేపథ్యంలో సాగే కథ ఈ సినిమా. ఎన్ఐఏ ఫీల్డ్ ఏజెంట్ జూనీ హక్సర్ ఇందులో మన హీరోయిన్. కాశ్మీర్‌లోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో, స్థానిక రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు కలిసి భారీ హింసను సృష్టించడానికి ట్రై చేస్తారు. ప్రధాని కార్యాలయం జాయింట్ సెక్రటరీ రాజేశ్వరి స్వామినాథన్ ఒక సీక్రెట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుంది. దానికి లీడర్‌గా జూనీని నియమిస్తుంది. జూనీ తన టీంతో కలిసి ఊహించని ఛాలెంజ్ లను అధిగమించి, ఆర్టికల్ 370ని విజయవంతంగా రద్దు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఏంటి ? ఆమెకు ఇచ్చిన మిషన్ ను ఎలా పూర్తి చేసింది ? అన్నది స్టోరీ.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

ఈ సినిమాలో యామీ గౌతమ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. ప్రియమణి బ్యూరోక్రాట్ పాత్రలో బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామా బ్యాలన్స్డ్ గా ఉంటాయి. ప్రస్తుతం Netflix, ZEE5లో తెలుగులో అందుబాటులో ఉంది. జాతీయ అవార్డు విన్నర్ గా నిలిచిన ఈ సినిమాను ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

ఈ సినిమాను ఎందుకు చూడాలి ?

72వ జాతీయ అవార్డుల్లో ‘ఆర్టికల్ 370’ సినిమా కంగా మూడు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకత్వం విభాగాల్లో ఈ సినిమా అవార్డ్స్ కొల్లగొట్టింది. జాతీయ స్థాయిలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచిన కంటెంట్ ఇది. కాబట్టి సినిమా క్వాలిటీ, కథ బాగుంటాయి. అంతేకాదు ఇది గ్రిప్పింగ్ పొలిటికల్ డ్రామా. రొటీన్ యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాదు చట్టపరమైన లూప్‌హోల్స్, జియోపొలిటికల్ సవాళ్లను దాటుకుని ఈ మైల్‌స్టోన్ మిషన్‌ను ఎలా ఎగ్జిక్యూట్ చేశారనేది మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లేతో చూపించారు. యామీ గౌతమ్, ప్రియమణి రోల్స్ అద్భుతంగా ఉంటాయి. బెస్ట్ స్క్రీన్‌ప్లే అండ్ థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఉత్కంఠను పెంచుతుంది. రీసెర్చ్-బేస్డ్ కంటెంట్‌తో నేషనల్ అవార్డుల జ్యూరీని మెప్పించిన ఈ మాస్టర్‌పీస్ ను డోంట్ మిస్.

Advertisement

Read Also: తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×