E-Paper
Advertisement

OTT Movie : దొంగల ఇంటికి కోడలుగా… ప్రైవేట్ వీడియోతో బ్లాక్ మెయిల్… క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

OTT Movie : దొంగల ఇంటికి కోడలుగా… ప్రైవేట్ వీడియోతో బ్లాక్ మెయిల్… క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూ, కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ఎంటర్టైనర్ కోసం వెతుకున్నారా ? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పర్ఫెక్ట్. ఏకంగా ఓ దొంగల ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెట్టిన అమ్మాయి లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అన్న విషయాన్ని పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో తెరకెక్కించారు మేకర్స్. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Advertisement

ఈ మూవీ పేరు “నారాయణ & కో” (Narayana & Co). 2023లో విడుదలైన తెలుగు కామెడీ-డ్రామా చిత్రం. ఈ మూవీతో చిన్నా పాపిశెట్టి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్‌ కోసం అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, ఒక చేయకూడని పని చేయడానికి ఒప్పుకుని పడిన ఇబ్బందులను హాస్యాస్పదంగా, కుటుంబ విలువలను ఎమోషనల్ గా చూపించారు. సుధాకర్ కొమాకుల, అమని, దేవి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా లైట్ హార్టెడ్ కామెడీ, కుటుంబ బంధాలు, కొన్ని క్రైమ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దేవి ప్రసాద్ (పీకే నారాయణ), ఆరతి పోడి, యామిని బండారు, పూజా కిరణ్, జై కృష్ణ (సుభాష్), సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ కొల్హాపూర్‌లో జరుగుతుంది. ఇక్కడ పీకే నారాయణ (దేవి ప్రసాద్)కు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నారాయణ ఒక బ్యాంక్ క్లర్క్‌గా పని చేస్తాడు. అతని భార్య జానకి (అమని) పట్టుచీరెలపై మక్కువ ఎక్కువ. అసలే ఆర్ధిక సమస్యలు అనుకుంటే, వాళ్ళ పెద్ద కొడుకు ఆనంద్ (సుధాకర్ కొమాకుల) క్రికెట్ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకుంటాడు. అయితే చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ)ను ఒక బ్లాక్‌మెయిలర్ బెదిరిస్తాడు. ఆ అబ్బాయి ప్రైవేట్ వీడియో తన దగ్గర ఉందని, అది కావాలంటే 10 లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. నారాయణ కూడా తన ఉద్యోగంలో ఒక తప్పిదం చేసి, భారీ మొత్తాన్ని చెల్లించవలసి వస్తుంది. ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు కుటుంబం ఒక చేయకూడని పని చేయాలని డిసైడ్ అవుతుంది.

అక్రమ వస్తువుల స్మగ్లింగ్ ఒప్పందం, దాని కోసం వాళ్ళు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా ఒక గూండాతో చర్చలు జరపడానికి వెళ్ళిన సన్నివేశంలో, వారి అమాయకత్వం, అనుభవలేమి కారణంగా వచ్చే కామెడీ సీన్స్ హైలెట్. ఇక మరోవైపు ఆనంద్‌ను ఒక పార్టీలో కలిసిన అమ్మాయి, గర్భవతి అని చెప్పి పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడం వంటి సన్నివేశాలు, సుభాష్ అనుచిత ప్రవర్తన కొన్ని సన్నివేశాల్లో వివాదాస్పదంగా అనిపించినప్పటికీ, కామెడీ బాగుంటుంది. ఇంతకీ ఈ డీల్ ను ఆ ఫ్యామిలీ ఎలా క్లోజ్ చేసింది ? సుభాష్ 10 లక్షలు ఇచ్చి తన వీడియోను సంపాదించాడా ? ఆనంద్, అతని తండ్రి పరిస్థితి చివరికి ఏమైంది? అన్నది స్టోరీ.

Read Also : దెయ్యాలు తిరిగే విచిత్రమైన రోడ్… ఒక్కసారి అడుగు పెడితే డైరెక్ట్ నరకమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×