E-Paper
Advertisement

OTT Movie : డబ్బు కోసం భార్య గదిలోకి మరో మగాడిని పంపే భర్త… క్రేజీ మలయాళ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : డబ్బు కోసం భార్య గదిలోకి మరో మగాడిని పంపే భర్త… క్రేజీ మలయాళ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీ లో వెబ్ సిరీస్ లు, సినిమాలకు దీటుగా పోటీ ఇస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లకు ప్రేక్షకులు కూడా బాగా అలవాటు పడిపోయారు.  ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్లో హీరో ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంటాడు.  ఆ కట్నం డబ్బుతో విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనుకుంటాడు.  ఈ విచిత్రమైన కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. మలయాళం నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney + hotstar) లో

Advertisement

ఈ మలయాళ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘నాగేంద్రన్‌స్ హనీమూన్స్’ (Nagendran Honeymoons). ఇది నితిన్ రెంజి పనిక్కర్ దర్శకత్వంలో 2024 లో విడుదలైంది. ఈ సిరీస్‌లో సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో నటించారు. ఈ స్టోరీ 1970 కాలంలో కేరళలోని తిరువనంతపురంలోని వెల్లయానిలో జరుగుతుంది ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney + hotstar) లో జూలై 19, 2024 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

నాగేంద్రన్ అనే సోమరిపోతు ఉద్యోగం లేకుండా,ఏ పనీ పాటా చేయకుండా ఉంటాడు. అయితే ఈ మహానుభావుడు విదేశాలకు వెళ్లి ధనవంతుడు కావాలని కలలు కంటాడు. అతని తల్లి కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. కానీ నాగేంద్రన్‌కు ఆమె పట్ల ఎలాంటి బాధ్యతా కూడా ఉండదు. అతని స్నేహితుడు సోమన్, ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ తో నాగేంద్రన్‌కు వీసా కోసం డబ్బు సమకూర్చడానికి ఒక విచిత్రమైన ఆలోచనను అతనికి చెప్తాడు. అది వివాహం చేసుకోవడం ద్వారా వచ్చే కట్నం డబ్బు తో విదేశాలకు వెళ్ళచ్చు అనడంతో నాగేంద్రన్‌ కూడా ఓకే చెప్తాడు. నాగేంద్రన్ తన మొదటి వివాహాన్ని తన బంధువైన జానకి తో జరుపుకుంటాడు. ఆమె తండ్రి కూడా మంచి కట్నం ఇస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఆతరువాత ఈ పెళ్ళిలో అనుకున్నంత కట్నం రాదు. అయినప్పటికీ నాగేంద్రన్ ఆగడు. అతను తన లక్ష్యాన్ని సాధించడానికి వివిధ ప్రాంతాల్లోని, విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన ఐదుగురు మహిళలను వివాహం చేసుకుంటాడు. లిల్లికుట్టి తంగం, లైలా సుల్తానా, సావిత్రి, జానకి ఇలా ఒక్కొక్కరిని కట్నం కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటాడు.

ప్రతి ఎపిసోడ్‌లో అతను ఒక కొత్త వధువును వివాహం చేసుకుంటాడు. ఇందులో విచిత్రంగా ఒక వేశ్య ను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆమె పెళ్లిచేసుకుని కూడా పాత పద్దతిలో కస్టమర్లను ఇంట్లోకి రప్పించుకుంటుంది. ఇలా ప్రతిసారీ అతని ప్లాన్‌లు విఫలమవుతూ,కొత్త సమస్యలను వచ్చి పడుతుంటాయి.ఈ సిరీస్ నాగేంద్రన్, సోమన్ ఈ మోసపూరిత వివాహాల నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలను చూపిస్తుంది. చివరికి నాగేంద్రన్ తన చర్యలపై అపరాధ భావనతో బాధపడతాడు. తన చివరి భార్య మోజీతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. అయితే, కథ ఒక ఆసక్తికరమైన మలుపుతో ముగుస్తుంది, అతను తన మోసాలకు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటాడు. చివరికి ఈ ఐదు గురు భార్యలు నాగేంద్రన్ ను ఏం చేస్తారనే విషయాన్ని ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో సురాజ్ వెంజరమూడు నాగేంద్రన్ పాత్రలో అద్భుతంగా నటించాడు.ఇందులో ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సిరీస్ మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×