E-Paper
Advertisement

ప్రేమలో మోసపోయి హత్య కేసులో చిక్కుకున్న అమ్మాయి… క్లైమాక్స్ వరకు అంతుచిక్కని మిస్టరీ

ప్రేమలో మోసపోయి హత్య కేసులో చిక్కుకున్న అమ్మాయి… క్లైమాక్స్ వరకు అంతుచిక్కని మిస్టరీ
Advertisement

Mystery Thriller OTT : మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు క్లైమాక్స్ వరకు సస్పెన్స్ తో నడుస్తాయి. ఆ తరువాత ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్తుంటారు దర్శకులు. అలాంటి సినిమా చూడాలనుకుంటే, ఈ హాలీవుడ్ మూవీపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా ఒక గట్టి సస్పెన్స్ థ్రిల్లర్ లా, ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఒక ఒంటరి అమ్మాయి హత్య కేసులో చిక్కుకోవడంతో కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఊహకు కూడా అందదు.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ 

2022లో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘వేర్ ది క్రాడాడ్స్ సింగ్’ (Where the Crawdads Sing). ఒలివియా న్యూమాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైసీ ఎడ్గార్-జోన్స్, టేలర్ జాన్ స్మిత్, హారిస్ డికిన్సన్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రముఖ నటి రీస్ విథర్‌స్పూన్ ఈ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమెకు ఈ నవల బాగా నచ్చడంతో, తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా దీనిని వెండితెరపైకి తెచ్చారు. కేవలం 24 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 144 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో తెలుగు ఆడియోతో సహా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ సినిమా కథ 1950నాటి కాలంలో జరుగుతుంది. ఇది చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగిన క్యా అనే అమ్మాయి కథ. చిన్నప్పుడే కుటుంబ సభ్యులందరూ వదిలేయడంతో, ఆమె ప్రకృతి ఒడిలోనే తనంతట తానుగా పెరిగి పెద్దవుతుంది. ఊరి జనం ఆమెను అంటారానిదానిలా చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి టేట్, చేజ్ అనే ఇద్దరు కుర్రాళ్లు వస్తారు. టేట్ ఆమెకు చదువు నేర్పించి ప్రేమగా చూసుకుంటే, చేజ్ అనే వాడు తన మాటలతో ఆమెను లోబర్చుకుంటాడు. అయితే ఒకరోజు ఊర్లో చేజ్ చనిపోయి కనిపిస్తాడు. పోలీసులు ఇది ఆ అడవి పిల్లే చేసిందని ఫిక్స్ అయిపోయి క్యాను జైల్లో పెడతారు.

ఇక కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఆమె గతం, ఆమె పడ్డ కష్టాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరికి కోర్టు ఆమె తప్పులేదని వదిలేస్తుంది. క్యా తిరిగి తాను బతుకుతున్న నేలకు వెళ్లిపోయి, తను ప్రేమించిన టేట్ తో కలిసి ప్రశాంతంగా ముసలితనం వరకు బతుకుతుంది. అయితే ఆమె చనిపోయిన తర్వాత, చేజ్ హత్యలో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. అసలు చేజ్ ను చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? ఈ మిస్టరీ ఎలా బయటపడింది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : పెళ్లి పీటల మీద ప్రియురాలిని వదిలేసే ప్రియుడు… కట్ చేస్తే ఏడేళ్ల కూతురితో అదిరిపోయే ప్రేమకథ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×