E-Paper
Advertisement

Mystery Thriller OTT : ఒళ్ళు గగుర్పొడిచే స్టోరి… చెల్లి మిస్సింగ్ తో అక్కలో వణుకు… మజా ఇచ్చే మిస్టరీ

Mystery Thriller OTT : ఒళ్ళు గగుర్పొడిచే స్టోరి… చెల్లి మిస్సింగ్ తో అక్కలో వణుకు… మజా ఇచ్చే మిస్టరీ
Advertisement

Mystery Thriller OTT : హారర్ సినిమాలు రకరకాలుగా భయపెట్టడానికి వస్తుంటాయి. ఆత్మలు, చేతబడులతో కొన్ని సినిమాలు భయాన్ని పీక్స్ కు తీసుకెళ్తుంటాయి. ఇప్పుడు అలాంటి సినిమా గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాను ఒక దెయ్యం సినిమా అనేకంటే, పల్లెటూరి కట్టుబాట్ల పేరుతో ఆడవాళ్ళను ఎలా వేధిస్తారో చూపించే ఫెమినిస్ట్ హారర్ సినిమా అనవచ్చు. కథలో చిన్నతనంలో తను వదిలేసి వెళ్ళిన తన సొంత గ్రామానికి 20 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చే ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. తన చెల్లెలు మరణం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలని ఆమె ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపులతో సాగుతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సైకలాజికల్ హారర్ సినిమా పేరు ‘నైట్ సైరన్’ (Nightsiren). 2022 లో స్లోవేకియా దేశానికి చెందిన ఈ సినిమాను తెరెజా నోవోటోవా దర్శకత్వం వహించారు. ఇందులో నటాలియా గెర్మాని (షార్లోటాగా), ఇవా మోరెస్ (మీరాగా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2022 లోకర్నో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ లెపర్డ్’ (Golden Leopard) అవార్డును గెలుచుకుంది. సుమారు 1 గంట 49 నిమిషాల పాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా prime video, Apple tvలో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. అయితే Tubi ఓటీటీలో విత్ యాడ్స్ తో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

షార్లోటా అనే యువతి చిన్నతనంలో తన చెల్లెలు మరణానికి తనే కారణమని ఊరి జనం నిందించడంతో, ఆ బాధ భరించలేక ఊరు విడిచి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత, తన గతానికి సంబంధించిన నిజాలను తెలుసుకోవాలని మళ్ళీ తన సొంత పల్లెటూరికి తిరిగి వస్తుంది. ఆమె రాక ఆ ఊరిలోని పాతకాలపు మనుషులకు నచ్చదు. అదే సమయంలో ఊరిలో పశువులు చనిపోవడం వంటి వింత సంఘటనలు జరగడంతో, గ్రామస్థులంతా కలిసి షార్లోటానే ఒక మంత్రగత్తె అని, ఆమె రాక వల్లే ఊరికి కీడు జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలో ఆమెకు మీరా అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. మీరా సహాయంతో షార్లోటా తన కుటుంబం గురించి, తన చెల్లెలు అదవిలో ఎలా మాయమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఊరి జనం మాత్రం మూఢనమ్మకాలతో ఆమెను వేధించడం మొదలుపెడతారు. అయితే చివరికి ఆమె ఆ ఊరి కట్టుబాట్లను ఎలా ఎదిరించి ? తన చెల్లెలి మరణం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది.

Read Also :  ఒక హత్య వంద పుకార్ల మర్డర్ మిస్టరీ… ఇన్వెస్టిగేషన్ లో ఊహించని మలుపులు… ఐయండిబిలో 7.9 రేటింగ్‌ ఉన్న సిరిస్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×