E-Paper
Advertisement

Mystery Thriller OTT : జంగిల్ లో మింగిల్ అయ్యే జంట… కట్ చేస్తే బుర్ర బద్దలయ్యే ట్విస్టు

Mystery Thriller OTT : జంగిల్ లో మింగిల్ అయ్యే జంట… కట్ చేస్తే బుర్ర బద్దలయ్యే ట్విస్టు
Advertisement

Mystery Thriller OTT : సూరజ్ వెంజరమూడు నటించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ వహించని మలుపులతో ఆకట్టుకుంటోంది. ఇది తన సొంత కొడుకు మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ఒక తండ్రి కథ. క్లైమాక్స్ వరకు ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి ఇందులో. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సూరజ్ వెంజరమూడు నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హెవెన్’ (Heaven). దీనికి ఉన్ని గోవింద్‌రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సురాజ్ వెంజరమూడు, దీపక్ పరంబోల్, అలెన్సియర్ లే లోపెజ్, సుదేవ్ నాయర్, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ సమకుర్చారు. హెవెన్ 2022 జూలై 17న థియేటర్లలో విడుదలైంది. 2022 ఆగస్టు 19 నుంచి Jio Hotstarలో ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం సినిమా తెలుగు,హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పీటర్ కురిషింకల్ (సూరజ్ వెంజరమూడు) అనే పోలీస్ అధికారి ఉంటాడు. అతని భార్య అనారోగ్యంతో చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత అతను తన తల్లి, కొడుకు సెబిన్‌తో కలిసి నివసిస్తుంటాడు. ఒకరోజు సెబిన్‌ తన స్నేహితుని మాథ్యూ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ మాథ్యూతో పాటు, పీటర్ కొడుకు సెబిన్ కూడా దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును మొదట DSP బిజోయ్ కురువిల్లా దర్యాప్తు చేస్తాడు. దొంగతనానికి వచ్చిన వాళ్ళే ఈ హత్యలు చేశారని భావించి, ఆ ఇంట్లో పనిచేసి పారిపోయిన ఒక వలస కూలీని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తారు.

ఈ ఇన్వెస్టిగేషన్ లో సంతృప్తి చెందని పీటర్ కిల్లర్ ని పట్టుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. సంఘటనా స్థలం పరిశీలించిన పీటర్, ఈ హత్యలు చేసింది ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తి అని గుర్తిస్తాడు. కానీ పోలీసులు అనుమానించిన వ్యక్తి కుడిచేతి వాటం కలవాడు. చివరికి పీటర్ ఇన్వెస్టిగేషన్ లో విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. ఆ నిజాలు ఏమీటి ? పీటర్ కిల్లర్ ని పట్టుకున్నాడా ? ఎందుకు అతను సెబిన్‌ ని చంపాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెఊసుకోవాల్సిందే.

Advertisement

Read Also : వింత వైరస్ తో అంతుచిక్కని రోగం… మొక్కల రూపంలో భూమిని కాపాడే సూపర్ హీరో

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×