// // mystery revenge thriller Agnyaathavaasi streaming now on ZEE5. -->
E-Paper
Advertisement

25 ఏళ్ల నుంచి క్రైమ్ అంటే ఏంటో తెలియని ఊర్లో 2 మర్డర్స్…. బ్రూటల్ రివేంజ్ థ్రిల్లర్

25 ఏళ్ల నుంచి క్రైమ్ అంటే ఏంటో తెలియని ఊర్లో 2 మర్డర్స్…. బ్రూటల్ రివేంజ్ థ్రిల్లర్
Advertisement

Mystery revenge thriller : ఊహించని మలుపులతో, నిమిషానికో ట్విస్ట్ తో అదిరిపోయే రివేంజ్ డ్రామాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొన్ని రివేంజ్ డ్రామాలు చూస్తే రక్తం మరిగిపోతుంది. అలాంటి ఓ ఆసక్తికరమైన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. 2025 ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ చిత్రం ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi). జనార్ధన్ చిక్కణ్ణ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ 1997 బ్యాక్‌డ్రాప్‌లో మలేనాడు ప్రాంతంలోని నాల్కేరి అనే చిన్న గ్రామంలో జరిగే మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. రంగాయణ రఘు, పావన గౌడ, శరత్ లోహితశ్వ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

నాల్కేరి గ్రామం గత 25 ఏళ్లుగా పెద్దగా నేరాలు జరగని, ఎంతో ప్రశాంతమైన ఊరు. అక్కడి పోలీస్ అవుట్‌ పోస్ట్ ఇన్‌స్పెక్టర్ గోవిందు (రంగాయణ రఘు) సగం సమయం పోలీస్ డ్యూటీ, సగం సమయం వ్యవసాయం చేసుకుంటూ చాలా సాదాసీదాగా జీవితం గడుపుతాడు. 1997 కాలంలో ఊరిలోకి మొదటిసారి కంప్యూటర్ వచ్చిన సందర్భం, ఐటీ బూమ్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో సహజంగా చూపించారు. అలాంటి సమయంలో మొదటి హత్య జరుగుతుంది.

Advertisement

అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఊర్లోని అతి ధనవంతుడు, భూస్వామి శ్రీనివాసయ్య (శరత్ లోహితశ్వ) అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఇన్‌స్పెక్టర్ గోవిందు దీనిని సహజ మరణం కాదని, స్పష్టంగా హత్యేనని ప్రకటిస్తాడు. 25 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న గ్రామం ఒక్కసారిగా భయాందోళనలకు గురవుతుంది. దీంతో గోవిందు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. శ్రీనివాసయ్య ఇంట్లో ఉండే పంకజ (పావన గౌడ), ఊరిలోకి కంప్యూటర్ తీసుకొచ్చిన రోహిత్ (సిద్దు మూలిమని)పై అనుమానాలు రేగుతాయి. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ 1970ల నాటి పాత కేసులు, దశాబ్దాలుగా దాగి ఉన్న గ్రామ రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడతాయి.

మొదటి హత్య కేసు ఇంకా పూర్తి కాకముందే ఊరిలో మరో మరణం సంభవిస్తుంది. ఇది మరో మిస్టరీగా మారుతుంది. సాంప్రదాయాలు, నేర ప్రవృత్తి, అపరాధ భావన, గ్రామంలో దాగి ఉన్న నిశ్శబ్దం వెనుక ఉన్న నిజమైన హంతకుడు ఎవరు ? ఇన్‌స్పెక్టర్ గోవిందు తన స్టైల్ లో ఈ రహస్యాన్ని ఎలా ఛేదించాడు ? అనేదే సినిమా ముగింపు.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

Advertisement

ఈ చిత్రంలో ‘హంతకుడు ఎవరు?’ అన్న కోణంలోనే కథ నడుస్తుంది. ఒక వ్యక్తిని హత్య చేయడానికి ప్రేరేపించిన మానసిక, సామాజిక కారణాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. రంగాయణ రఘు ఇన్‌స్పెక్టర్ గోవిందు పాత్రలో తన అనుభవసం ఉన్న నటనతో మెప్పించాడు. పావన గౌడ, శరత్ లోహితశ్వ బాగా నటించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ మూవీని డోంట్ మిస్.

Read Also : ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×