E-Paper
Advertisement

OTT Movie : జోంబీగా మారే అందమైన అమ్మాయి… ప్రేమ అంటూ వెంటపడే అబ్బాయి… గుండెకు హత్తుకునే లవ్ స్టోరీ

OTT Movie : జోంబీగా మారే అందమైన అమ్మాయి… ప్రేమ అంటూ వెంటపడే అబ్బాయి… గుండెకు హత్తుకునే లవ్ స్టోరీ
Advertisement

OTT Movie : కామెడీ, రొమాన్స్, హారర్ ఎలిమెంట్స్‌తో ఒక సిరీస్ వచ్చింది. అయితే ఇది ఒక జోంబీ సిరీస్. యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన ఈ సిరీస్, ఒక యువకుడు ఒక జోంబీ అమ్మాయితో ప్రేమలో పడటంతో మొదలవుతుంది. ఆతరువాత వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా జరిగిందనేదే ఈ సిరీస్ కథ. ఈ కంటెంట్ ను వింటూంటేనే ఆసక్తి కలుగుతోంది. మరి చూస్తే పక్కా ఎంటర్టైన్ చేస్తుంది ఈ సిరీస్. దీని పేరు, ఎక్కడ ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2019లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ జాంబీ వెబ్ సిరీస్ పేరు ‘మై జోంబీ క్రష్’ (My Zombie Crush). దీనిని తైవాన్‌కు చెందిన యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ గ్రూప్ Yes Ranger నిర్మించింది. సీజన్ 1లో దాదాపు 10 ఎపిసోడ్‌లు ఉంటాయి. దీనిని LifeAfter అనే మొబైల్ గేమ్ ప్రమోషన్ కోసం నిర్మించారు. అందుకే ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. ఇది నిజానికి తైవానీస్/చైనీస్ భాషలో రూపొందింది. కానీ Yes Ranger YouTube Channel లో దీనిని ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సిరీస్ ఒక విచిత్రమైన ప్రేమకథతో నడుస్తుంది. ప్రపంచమంతా జోంబీ వైరస్‌తో అల్లాడుతున్న సమయంలో, హీరో తన చుట్టూ ఉన్న ప్రమాదాలను లెక్కచేయకుండా ఒక జోంబీ అమ్మాయితో ప్రేమలో పడతాడు. సాధారణ జోంబీ సినిమాల్లో లాగా కేవలం భయం, హింస మాత్రమే కాకుండా, ఒక మనిషి జోంబీతో ఎమోషన్ గా ఉండటాన్ని ఈ సిరీస్ హైలెట్ చేస్తుంది. హీరో జోంబీ అమ్మాయితో కలిసి జీవించడానికి చేసే ప్రయత్నాలను ఈ సిరీస్ వినోదాత్మక శైలిలో చూపిస్తుంది.

కథ ముందుకు సాగే కొద్దీ, వాళ్ళ మధ్య ఉన్న బంధం అనేక మలుపులు తిరుగుతుంది. ఒక ఎపిసోడ్‌లో జోంబీగా ఉన్న అమ్మాయి మళ్ళీ మనిషిగా మారగా, అదే సమయంలో హీరో జోంబీగా మారిపోతాడు. ఈ సమయంలో వారిద్దరూ ఒకరినొకరు కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ వెబ్ సిరీస్ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

Advertisement

Read Also : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అదుర్స్… కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోని సన్నీ లియోన్ మూవీ… ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×