E-Paper
Advertisement

OTT Movie : 15 ఏళ్లకే పెళ్లి, భర్తకు తెలీకుండా మరొకరితో ప్రేమ … ఈ కొరియన్ సినిమాలో ఎన్ని ట్విస్టులో

OTT Movie : 15 ఏళ్లకే పెళ్లి, భర్తకు తెలీకుండా మరొకరితో ప్రేమ … ఈ కొరియన్ సినిమాలో ఎన్ని ట్విస్టులో
Advertisement

OTT Movie : 15 ఏళ్ల బో-యున్ ఒక సాధారణ హైస్కూల్ అమ్మాయి. తన పరీక్షల గురించి ఆందోళన చెందుతూ ఉంటుంది. మరో వైపు స్కూల్ బేస్‌బాల్ టీమ్ ఆటగాడు జంగ్-వూ మీద క్రష్‌తో ఉంటుంది. ఆమె జీవితం సరదాగా సాగుతున్న సమయంలో, ఆమె తాత ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఆమెకు 20లలో ఉన్న సాంగ్-మిన్ అనే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. బో-యున్, సాంగ్-మిన్ ఇద్దరూ ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, తాత ఒత్తిడి వల్ల వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. బో-యున్ తన స్కూల్ లైఫ్‌ను, క్రష్‌ను కొనసాగించాలని అనుకుంటుంది. ఈ వ్యవహారం స్కూల్‌లో గందరగోళంగా మారుతుంది. ఇక వీరిద్దరూ కలసి ఉంటారా ? విడిపోతారా ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళితే

Advertisement

బో-యున్ (మూన్ గ్యూన్-యంగ్) అనే ఒక 15 ఏళ్ల హైస్కూల్ అమ్మాయి, స్కూల్ బేస్‌బాల్ టీమ్ ఆటగాడు జంగ్-వూ మీద క్రష్‌తో ఉంటుంది. సాంగ్-మిన్ (కిమ్ రే-వాన్) అనే 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి, కొంచెం ప్లేబాయ్ స్వభావం కలిగి ఉంటాడు.  వీరిద్దరూ చిన్నప్పటి నుండి స్నేహితులు.  వీళ్ళ కుటుంబాలు కొరియన్ యుద్ధ సమయంలో ఒకరికొకరు సన్నిహితంగా ఉండేవి. బో-యున్ తాత (కిమ్ ఇన్-మున్), తన స్నేహితుడైన సాంగ్-మిన్ తాతతో చేసిన ఒప్పందం ప్రకారం, వీరిద్దరినీ పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. తాత ఆరోగ్యం గురించి బో-యున్, సాంగ్-మిన్ ఈ వివాహానికి ఒప్పుకుంటారు. అయితే ఈ నిర్ణయంతో వీళ్ళు ఇంకా షాక్ లోనే ఉంటారు. ఇంతలోనే పెళ్లి కూడా జరిగిపోతుంది.

ఇక బో-యున్ తన సాధారణ స్కూల్ జీవితాన్ని కొనసాగించాలనుకుంటుంది. కాబట్టి ఆమె తన వివాహాన్ని స్కూల్‌లో రహస్యంగా ఉంచుతుంది. ఆమె జంగ్-వూ (స్కూల్ బేస్‌బాల్ ప్లేయర్)తో డేటింగ్ ప్రారంభిస్తుంది.  బో-యున్ పట్ల సాంగ్-మిన్ జాగ్రత్తగా, గౌరవంగా వ్యవహరిస్తాడు. ఆమె సౌకర్యం కోసం తన అలవాట్లను కూడా పక్కన పెడతాడు. ఇక స్టోరీ గందరగోళంగా సాగుతుంది. ఎందుకంటే బో-యున్ స్కూల్‌లో సాంగ్-మిన్ టీచర్ ఇంటర్న్‌గా చేరతాడు. ఇది హాస్యాస్పదమైన, ఇబ్బందికరమైన సన్నివేశాలకు దారితీస్తుంది. బో-యున్ బెస్ట్ ఫ్రెండ్ కి, జంగ్-వూ మీద క్రష్ ఉంటుంది.  దీనివల్ల బో-యున్ పట్ల ఆమె ఈర్ష్యతో ఉంటుంది. ఇది స్టోరీని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది.

Advertisement

స్కూల్‌లో ఒక టీచర్ అయిన మిస్ కిమ్, సాంగ్-మిన్‌తో ఫ్లర్ట్ చేస్తుంది. కానీ అతనికి  బో-యున్‌తో వివాహం అయిన విషయం తెలిసినప్పుడు, ఆమె బో-యున్‌ను శిక్షించడానికి ఒక స్టేజ్ గోడను పెయింట్ చేయమని ఆదేశిస్తుంది. ఈ విషయంలో సాంగ్-మిన్ రహస్యంగా బో-యున్‌కు సహాయం చేస్తాడు.  ఒక కుటుంబ సమావేశంలో,  జంగ్-వూ తో బో-యున్ ఉన్న వీడియో బయటపడటంతో స్టోరీ మలుపు తీసుకుంటుంది. చివరికి బో-యున్ ఎవరిని ఇష్టపడుతుంది ? భర్త సాంగ్-మిన్‌తో ఉంటుందా ? బాయ్ ఫ్రెండ్ జంగ్-వూ తో ఉంటుందా ? అనే  విషయాలను ఈ కొరియన్ సినిమాను చూసి తెలుసుకోండి.

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసా

ఈ కొరియెన్ మూవీ పేరు ‘మై లిటిల్ బ్రైడ్’ (My Little Bride). ఈ సినిమాకి కిమ్ హో-జూన్ దర్శకత్వం వహించారు. ఇందులో మూన్ గ్యూన్-యంగ్ (బో-యున్), కిమ్ రే-వాన్ (సాంగ్-మిన్), కిమ్ బో-క్యుంగ్, అహన్ సన్-యంగ్, కిమ్ ఇన్-మున్ (తాత) వంటి నటులు నటించారు. 1 గంట 55 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.0/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×