E-Paper
Advertisement

Thriller Movie OTT : భార్యను చంపేసి గర్ల్ ఫ్రెండ్‌తో… అయ్యబాబోయ్ ఇదేం అరాచకంరా అయ్యా

Thriller Movie OTT : భార్యను చంపేసి గర్ల్ ఫ్రెండ్‌తో… అయ్యబాబోయ్ ఇదేం అరాచకంరా అయ్యా
Advertisement

Thriller Movie OTT : భార్య ఉండగా మరో అమ్మాయితో రిలేషన్ లో ఉండే అబ్బాయి వంటి స్టోరీ లైన్స్ తో వచ్చిన కతలెన్నో ఇప్పటిదాకా చూశాం మనం. కానీ ఇలాంటి సినిమాలలో అయితే భార్యను చంపేస్తారు లేదా వదిలేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే సినిమాలో మాత్రం ఇలాంటి స్టోరీ లైన్ ఉంటుంది. కానీ ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. మరీ ఆ ట్విస్ట్ ఏంటి? ఈ సినిమా ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

గంగాధర్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు రొమాంటిక్ లీగల్ థ్రిల్లర్ Mukhachitram (2022). ఈ సినిమాలో వికాస్ వాసిష్ఠ (డాక్టర్ రాజ్‌కుమార్), ప్రియ వడ్లమాని (మహతి), అయేషా ఖాన్ (మాయా), చైతన్య రావు మాదడి ప్రధాన పాత్రల్లో నటించారు. విశ్వక్ సేన్ కేమియోలో (లాయర్ విశ్వమిత్ర) కంపించగా, పి. రవిశంకర్, సునీల్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. IMDbలో రేటింగ్ 6.3 తెచ్చుకున్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ సీరియస్ ఇష్యూస్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకుంటే మాత్రం మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. Amazon Prime Videoలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  ఓటీటీ అలర్ట్… డిజిటల్ కష్టాలు గట్టెక్కిన మలయాళం మూవీ… ఎట్టకేలకు సైలెంట్ గా స్ట్రీమింగ్

స్టోరీలోకి వెళ్తే…

డాక్టర్ రాజ్‌కుమార్ ప్లాస్టిక్ సర్జన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే చైల్డ్‌ హుడ్ లవర్ మాయా ఫెర్నాండెజ్‌ను వదిలేస్తాడు. ఆమెను పక్కన పెట్టి సాంప్రదాయబద్ధంగా ఉండే విలేజ్ అమ్మాయి మహతిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తరువాత మళ్ళీ హీరో లైఫ్ లోకి మాజీ ప్రేయసి ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఓవైపు భార్య, మరోవైపు ప్రియురాలితో కలిసి గడుపుతూ ఉంటాడు హీరో. అంతా సవ్యంగా సాగుతోంది అనుకునేలోపే సినిమాలో ఓ ట్విస్ట్ వస్తుంది. పెళ్లి తర్వాత కొన్ని నెలలకు ఒక ఊహించని ట్రాజెడీ చోటు చేసుకుంటుంది. మాయా ఒక యాక్సిడెంట్‌ లో ఘోరంగా గాయపడుతుంది. ఈ సంఘటన తర్వాత రాజ్‌ కుమార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం, అది అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

Advertisement

ఇప్పటిదాకా మంచి రొమాంటిక్ స్టోరీగా నడిచిన కథ కోర్ట్‌రూమ్ డ్రామాగా మారి… పెళ్లయ్యాక టార్చర్, కన్సెంట్, ఐడెంటిటీ వంటి సీరియస్ ఇష్యూలను టచ్ చేస్తుంది. అసలు డాక్టర్ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వస్తుంది ? ఇంతకీ డాక్టర్ తీసుకున్న ఆ కాంట్రవర్షియల్ నిర్ణయం ఏంటి? పెళ్లయ్యాక డాక్టర్, అతని భార్య మధ్య ఏం జరిగింది? ఇందులో అతని ప్రేయసి పాత్ర ఏంటి? హీరోయిన్ కి యాక్సిడెంట్ కావడానికి వెనకున్న కారణం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×