E-Paper
Advertisement

MSVPG OTT : ‘ MSGV’ ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

MSVPG OTT : ‘ MSGV’ ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

MSVPG OTT : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార జంటగా నటించిన తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు.. టాలీవుడ్ సక్సెస్ఫుల్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. సంక్రాంతి కానుకగా ఇవాళ థియేటర్లలోకి ఈ సినిమా వచ్చేసింది.. మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న పడిన ప్రీమియర్ షాలతోనే జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

MSGV ఓటీటీ పార్ట్నర్ లాక్..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. 157వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి పాటకు మంచి వ్యూస్ రావడంతో పాటుగా జనాలనుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ఫుల్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు కొనుగోలు చేసింది.. అలాగే శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు సొంతం చేసుకుంది.. ఒక నెల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని సమాచారం.. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Also Read :విజయ్ మరో షాక్.. సీబీఐ ఎదుట విచారణకు హాజరు..

ఈ మూవీ బడ్జెట్ & టార్గెట్..

చిరంజీవి నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.. సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందగా.. ప్రచార ఖర్చులతో కలిపి మొత్తం బిజినెస్ రూ. 225 కోట్ల నుండి రూ. 250 కోట్ల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.. థియేట్రికల్ రైట్స్ ద్వారానే కాకుండా, నాన్-థియేట్రికల్ పరంగా కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 105 కోట్లు, ఆంధ్రా హక్కులు 55 కోట్లు, నైజాం 32 కోట్లు, సీడెడ్ వాటా 18 కోట్లుగా ఉంది.. నార్త్ అమెరికా హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యాయి.. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల బిజినెస్ జరిగింది.. 400 నుంచి 500 కోట్లు వసూలు చేస్తుందని మెగా ఫాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి చివరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్టులకు మెగాస్టార్ చిరంజీవి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సినిమాలను ప్రకటించే అవకాశం ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×