E-Paper
Advertisement

Mowgli OTT: మోగ్లీ ఓటీటీలోకి వచ్చేసింది… మూడు వారాలు కూడా కాలేదు అప్పుడే

Mowgli OTT: మోగ్లీ ఓటీటీలోకి వచ్చేసింది… మూడు వారాలు కూడా కాలేదు అప్పుడే
Advertisement

Mowgli OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదల అయ్యింది అంటే కేవలం నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కేవలం నెల రోజులలోపే ఓటీటీలోకి రాబోతున్న నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు కూడా దూరమవుతున్నారని సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న అనంతరం చిత్ర నిర్మాతలు సినిమాల విడుదల తేదీని కూడా ప్రకటిస్తుండటం గమనార్హం. ఇకపోతే డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. ఇలా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన సినిమాలలో మోగ్లీ (Mowgli)సినిమా ఒకటి.

20 రోజుల్లోనే ఓటీటీలోకి..

కలర్ ఫోటో ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj)దర్శకత్వంలో, రోషన్ కనకాల(Roshan Kanakal), సాక్షి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫారెస్ట్ లవ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం అనుకున్న విధంగా కాకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు బాలకృష్ణ అఖండ 2 విడుదలవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈటీవీ విన్ లో మోగ్లీ..

Advertisement

ఈ సినిమా విడుదల అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకుండానే తిరిగి ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్(Etv Win) సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి ఒకటవ తేదీ నుంచి ఈటీవీ విన్ లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల వ్యవధిలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం కావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరో రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.

విలన్ గా బండి సరోజ్..

Advertisement

కలర్ ఫోటో లాంటి సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రాజ్ మొదటి సినిమాతోనే ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మోగ్లీ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి కానీ అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఈ సినిమాలో బండి సరోజ్ (Bandi Saroj) విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఒక యాక్షన్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక రోషన్ కనకాలకు ఇది రెండవ సినిమా అనే విషయం తెలిసిందే. ఇది వరకు ఈయన బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Also Read: Mega Victory Mass song: ఆర్ యూ రెడీ.. మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసిందిరోయ్!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×