E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలోకి కొలీవుడ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : ఓటీటీలోకి కొలీవుడ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

OTT Movie : థియేటర్ల లోకి కొత్త సినిమాలు ఎలా వస్తున్నాయి అలానే ఓటీటీ లోకి కూడా నెలలోపే కొత్త సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. ఇక థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా హిట్ టాక్ ను అందుకోవడం కష్టమే.. కానీ ఓటీటీలోకి వచ్చిన ప్రతి మూవీ మంచి వ్యూస్ ను అందుకుంటున్నాయి. ఇక తాజాగా మరో కొలీవుడ్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..

తమిళ హీరో, ప్రొడ్యూసర్ ప్రభుదేవా హీరోగా నటించిన తమిళ్ మూవీ పేట్టా రాప్ థియేటర్లలో నెగెటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నది. సెప్టెంబర్ నెల చివరిలో థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ కామెడీ మూవీలో వేదిక హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్ని లియోన్ హీరోయిన్ నటించింది. పేట్టా రాప్ మూవీకి ఎస్‌జే సిను దర్శకత్వం వహించాడు.. టీజర్స్‌, ట్రైలర్స్‌తో అంచనాలు రేకెత్తించిన పేట్టా రాప్ మూవీ ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్‌, సాంగ్స్ ఆకట్టుకున్న కథతో పాటు డైరెక్టర్ టేకింగ్‌పై విమర్శలొచ్చాయి. ప్రేమికుడు సినిమాలోని సాంగ్ నుంచి ఈ మూవీ టైటిల్ ను పెట్టారు. ఇదే దీనికి అతి పెద్ద మైనస్ అయ్యింది .

Advertisement

అయితే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన నెలన్నర తరువాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ యాక్షన్ కామెడీ చిత్రం యొక్క ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. పేట్టా రాప్ మూవీ నవంబర్ 8 న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకు రాబోతున్నట్లు సమాచారం.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి యాక్టర్ కావాలనే కల కంటాడు. వందకుపైగా ఆడిషన్స్ అటెండ్ అయినా అతడికి ఒక్క అవకాశం రాదు. స్నేహితులతో పాటు కుటుంబసభ్యులు సూటిపోటి మాటలు సహించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అనుకోకుండా జానకి అనే సింగర్‌ ద్వారా అతడి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ.. ఇక ప్రభుదేవా సినిమాల విషయానికొస్తే.. తమిళ, మలయాళ భాషల్లో ఆరు సినిమాలు చేస్తోన్నాడు. డైరెక్టర్‌గా తెలుగులో నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హిందీలో డైరెక్టర్‌గా అక్షయ్ కుమార్‌తో రౌడీ రాథోడ్‌, సింగ్ ఈజ్ బ్లింగ్‌, సల్మాన్ ఖాన్‌తో దబాంగ్ 3, రాధే తో పాటు కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేశాడని టాక్.. త్వరలోనే వాటి డీటెయిల్స్ ను అనౌన్స్ చెయ్యనున్నాడు..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×