// // Most-awaited Tamil web series : ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ తమిళ -->
E-Paper
Advertisement

Most-awaited Tamil web series : ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ తమిళ సిరీస్ లు ఇవే… ఏ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Most-awaited Tamil web series : ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ తమిళ సిరీస్ లు ఇవే… ఏ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?
Advertisement

Most-awaited Tamil web series : తమిళ ఓటీటీ లవర్స్‌కి 2026 మాత్రం అదిరిపోయే కంటెంట్ తో వెబ్ సిరీస్ లు రానున్నాయి. యాక్షన్, రొమాన్స్, మిస్టరీ, కామెడీ, సస్పెన్స్ లాంటి అన్ని జానర్లలోనూ మోస్ట్ అవైటెడ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్న టాప్ తమిళ వెబ్ సిరీస్‌లు ఇవే. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయో తెలుసుకుందాం పదండి.

1. తాడయం (Thadayam)

నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రైమ్ వెబ్ సిరీస్1999 నాటి తమిళనాడు సరిహద్దుల్లో జరిగే దారుణమైన హత్యల చుట్టూ తిరుగుతుంది. ఒక కొత్త పోలీసు అధికారి (సముద్రఖని) ఈ కేసును పరిష్కరించడానికి వస్తాడు. చిన్న చిన్న ఆధారాలతో అతను కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడనేదే మిగతా కథ. ZEE5 ఓటీటీలో ఫిబ్రవరి 27 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది.

2. లెగసీ (Legacy)

Advertisement

ఆర్ మాధవన్, నిమిషా సజయన్, గుల్షన్ దేవయ్య నటిస్తున్న ఈ తమిళ వెబ్ సిరీస్ చారుకేష్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఒక గ్యాంగ్‌స్టర్ కుటుంబం కేంద్రంగా జరిగే డ్రామాగా ఇది ఉండబోతోంది. ఇందులో గౌతమ్ కార్తీక్, అభిషేక్ బెనర్జీ కూడా నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది స్ట్రీమింగ్ కి వస్తుంది.

3. లవ్ (Love)

లవ్ అనేది బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఒక రొమాంటిక్ డ్రామా సిరీస్. ఇందులో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. మనస్తత్వాలు వేరు ఉన్న ఒక జంట చుట్టూ తిరిగే ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండబోతోంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ఈ ఏడాది రాబోతోంది.

4. హార్ట్ బీట్ S3 (Heart Beat S3)

Advertisement

హార్ట్ బీట్ S3 అనేది ఒక మెడికల్ డ్రామా సిరీస్. ఇది మొదటి రెండు సీజన్లలో 100 ఎపిసోడ్‌లకు పైగా ఉంది. ఇప్పుడు మూడవ సీజన్‌ తో మళ్లీ వస్తోంది. ఈ సిరీస్‌లో అనుమోల్, కార్తీక్ కుమార్, దీపా బాలు తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు. దీపక్ సౌందరరాజన్ మూడవ సీజన్‌కు దర్శకత్వం వహించనున్నారు. JioHotstar లో ఇది అందుబాటులోకి రానుంది.

5. ది మద్రాస్ మిస్టరీ (The Madras Mystery)

ది మద్రాస్ మిస్టరీ – ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్ అనేది నజియా ఫహద్ నటించనున్న రాబోయే సిరీస్. ఈ సిరీస్‌కు సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి, శాంత్ను భాగ్యరాజ్, నాజర్, వై.జి. మహేంద్రన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ జర్నలిస్ట్ లక్ష్మీకాంతన్ హత్య చుట్టూ తిరుగుతుంది. SonyLIV లో ఈ ఏడాది ఇది రానుంది.

6.కాట్టన్ (Kaattaan)

ఇది విజయ్ సేతుపతి నటించి, నిర్మించిన ఈ యాక్షన్ సిరీస్, మణికందన్ దర్శకత్వంలో వస్తోంది. JioHotstarలో ఇది జూన్ 2026లో విడుదల అవుతుంది.

7. గుడ్ వైఫ్ (Good Wife 2)

ఫస్ట్ సీజన్ భారీ హిట్ అయిన తర్వాత సీజన్ 2 వస్తోంది. లీగల్ డ్రామా, సస్పెన్స్, ఎమోషన్ మిక్స్ తో నడిచే స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ జర్నీ ఇది. Zee5లో జూలై 2026 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Read Also : ఆషికా రంగనాథ్ కన్నడ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా తెలుగులో స్ట్రీమింగ్… ఏ ఓటీటీలో ఉందంటే ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×