E-Paper
Advertisement

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… ఒక్కోటి ఒక్కో జానర్

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… ఒక్కోటి ఒక్కో జానర్
Advertisement

OTT Movie : ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న సరికొత్త కన్నడ సినిమాలు, తొందర్లోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ సినిమాలు ఒక్కోటి ఒక్కో జానర్ లో తెరకెక్కాయి. ఈ సినిమాలన్నీ థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక మూవీ లవర్స్ కి ఈ నెల పండగ చేసుకోవడమే ఆలస్యం. ఈ కన్నడ సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

‘హెబ్బులి కట్’ (Hebbuli Cut)

Advertisement

ఈ కన్నడ కామెడీ మూవీకి భీమరావు దర్శకత్వం వహించారు. ఇది సతీశ్ నీనాసం నిర్మాణ సమర్పణలో సారా ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఈ సినిమా 2025 జూలై 4 న థియేటర్లలో విడుదలైంది. ఇది 2017లో విడుదలైన కన్నడ చిత్రం ‘Hebbuli’ లో, కిచ్చా సుదీప్ ఐకానిక్ హెయిర్‌స్టైల్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఉత్తర కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇందులో నవనీత్ శామ్, దీపక్ యరగెర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలైంది. ఈ నెలలో ఓటీటీలోకి ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

‘కపట నాటక సూత్రధారి’ (Kapata Nataka Sutradhari)

Advertisement

ఈ పొలిటికల్ డ్రామా మూవీకి ధీరజ్ ఎం.వి. దర్శకత్వం వహించారు. ఇందులో అభిరామ అర్జున, ధీరజ్ ఎం.వి., వరుణ్ గురురాజ్, శ్రీ సాగర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రాజకీయ,మతపరమైన అంశాలతో తెరకెక్కింది. 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2025 జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ ఫామ్‌లలో ఈ సినిమా త్వరలో అందుబాటులోకి రానుంది.

‘జంగల్ మంగళ్’ (Jungle Mangal)

ఈ కన్నడ లైట్-హార్టెడ్ థ్రిల్లర్ మూవీకి రక్షిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో యశ్ శెట్టి, హర్షిత రామచంద్ర, ఉగ్రం మంజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 జూలై 4న కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇది కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మల్నాడ్, కరావళి ప్రాంతాల సంస్కృతి నేపథ్యంలో, ఒక లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను 750,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 1 గంట 32 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.8/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా, ఈ నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

‘పెన్ డ్రైవ్’ (Pen Drive)

ఈ కన్నడ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ డేవిడ్ దర్శకత్వం వహించారు. ఇందులో మాళశ్రీ, తనీషా కుప్పండ, సంజనా నాయుడు, కరి సుబ్బు, బిగ్ బాస్ ఫేమ్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2025 జూలై 4 న కర్ణాటకలోని థియేటర్లలో విడుదలైంది. RH ఎంటర్‌ప్రైజెస్, శ్రీ తిరుమల సినీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌లపై N హనుమంతరాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా స్టోరీ ఒక పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది.

Read Also : దెయ్యంతో పెళ్లి డీల్… ఫ్యామిలీలో వరుస హత్యలు… కలలో కూడా ఊహించని డేంజరస్ హర్రర్ స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×