VaaZha 2 OTT: ఇటీవల కాలంలో మలయాళం సినీ ఇండస్ట్రీ నుంచి.. తక్కువ బడ్జెట్ తో కొత్త నటీనటులతో తెరకెక్కుతూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్న ఎన్నో చిత్రాలు ఇప్పుడు ఓటీటీలలో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి వాటిలో వాలా 2 కూడా ఒకటి. మలయాళంలో కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో కొత్త నటీనటులతో ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారుగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక మలయాళం లో బ్లాక్ బాస్టర్ అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను ఏప్రిల్ 26వ తేదీన తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే అలా తెలుగులో థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాలకే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఏ ప్లాట్ఫారం వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..
మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్ స్టార్ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రావడంతో అభిమానులు కూడా ఈ సినిమా వీక్షిస్తున్నారు. మరి 24 గంటలు గడిస్తే తప్ప ఈ సినిమా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుందో చెప్పలేం. ఇకపోతే 2024లో వచ్చిన వాలా: బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని రూపొందించారు. ఈ రెండు భాగాలకి విపిన్ దాస్ కథను అందించగా.. ఆనంద్ మీనన్ ఫస్ట్ భాగానికి దర్శకత్వం వహించారు. ఇక రెండవ భాగానికి సవిన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ లో మాత్రం టాప్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు.
ALSO READ:బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనా?
వాలా 2 సినిమా స్టోరీ..
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. నలుగురు యువకుల జీవితంలో జరిగిన కథ. మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్.. ప్రతి ఒక్కరు కనెక్ట్ చేసుకునేలా ఈ స్టోరీని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మధ్యతరగతికి చెందిన నలుగురు విద్యార్థులను చదివించేందుకు వీరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. తమ పిల్లలను గొప్పవాళ్ళు చేయాలి అని కలలు కూడా కంటారు. అయితే వీళ్ళు మాత్రం చదువులో కంటే కూడా ఎక్కువగా గొడవలు అల్లరిలోనే ముందుంటారు. అలా తెచ్చుకున్న గొడవలతో కాలేజీ నుండి సస్పెండ్ అయ్యే పరిస్థితికి చేరుకుంటారు. ఆ సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ కలగజేసుకొని వీరిని కాపాడుతాడు. ఇక ఆయన సిఫారసుతోనే చివరికి పరీక్ష రాసే ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఉన్నత చదువుల కోసం ,ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకున్న ఈ నలుగురు తమ కలను నిజం చేసుకున్నారా? తల్లిదండ్రులకు కలలను నెరవేర్చారా ?అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.