E-Paper
Advertisement

OTT Movie: మైండ్ చెదిరిపోయింది గురు, “దృశ్యం” సినిమాను మించి ట్విస్టులు

OTT Movie: మైండ్ చెదిరిపోయింది గురు, “దృశ్యం” సినిమాను మించి ట్విస్టులు
Advertisement

OTT Movie: ప్రేక్షకులు అందరికీ అన్ని సినిమాలు నచ్చవు. ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా చూడటానికి ఇష్టపడుతుంటారు. అలానే థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉంటారు. తర్వాతే ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో థియేటర్లో కూర్చోవడం అనేది మామూలు విషయం కాదు. అది సాధారణ ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ఇస్తుంది. అలాంటి సినిమాలు అతి తక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మలయాళంలో ఈ సినిమాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. తెలుగులో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకదాన్ని మించి ఒకటి బుర్ర చెదిరిపోయే ట్విస్టులు ఆ సినిమాలోనే ఉంటాయి. ఒక దానికి ఒకటి ఊహించకుండా సినిమాలో జరుగుతూ ఉంటుంది. ఇక ఆ జోనర్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులకు ఇప్పుడు చెప్పబోయే సినిమా కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మోహన్ లాల్ సెలక్షన్ ఆ రేంజ్ లో ఉంటుంది 

Advertisement

దృశ్యం ఒరిజినల్ సినిమాను మొదట మోహన్ లాల్ నటించారు. ఆ తర్వాత మిగతా భాషల్లో కొంతమంది హీరోలు కనిపించారు. ఏ భాషలో చూసిన ఆ సినిమా కథ కు ఉన్న బలం వలన అది మంచి థ్రిల్ ఇస్తుంది. ఇక రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన తుడరమ్ సినిమా కూడా అలానే ట్విస్టుల మీద ట్విస్టులతో ముడిపడి ఉంటుంది వినడానికి మామూలు కథల అనిపించినా కూడా ఆ స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు అసలు మలయాళం వాళ్లకి ఇంత గొప్ప ఆలోచన ఎలా వస్తాయి అనే ఆలోచన మనలో పుడుతుంది. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకులంతా కూడా ఇటువంటి సినిమాలను ఇష్టపడటం మొదలుపెట్టారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఖచ్చితంగా దీనిని చూడాల్సిందే.

సినిమా అసలు కథ 

Advertisement

మధ్య తరగతి ట్యాక్సీ డ్రైవర్ అయిన షణ్ముగం అలియాస్ బెంజ్ తన బ్లాక్ అంబాసిడర్ కార్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అతను తన భార్య లలిత, కొడుకు పవన్, కూతరులతో సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. ఓ రోజు అనుకోకుండా అతని కారు యాక్సిడెంట్కు గురవుతుంది. దీంతో దానిని రిపేర్ కోసం ఇవగా, మెకానిక్ ఆ కారును చట్టవిరుద్ధమైన పనులకు వాడుకుంటాడు. దీంతో అతని కారును ఎలాగైనా తిరిగిపొందేందుకు బెంజ్ ఎస్ఐ బెన్ని ను కలుస్తాడు. ఈ కేసును సీఐ జార్జ్ మాథెన్ టేకప్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులతో బెంజ్ కు ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి..? అసలు పోలీసులు బెంజ్ దగ్గర ఏదైనా దాచిపెట్టారా..? బెంజ్ అతని కారును తిరిగి పొందుతాడా..? అనేది సినిమా కథ.

Also Read : ‘తమ్ముడు’ విషయంలో దిల్ రాజు ఏంటీ ఇలా చేస్తున్నారు? వర్కవుట్ అయ్యేనా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×