E-Paper
Advertisement

OTT Movie : బుర్రపాడు సీన్లురా బాబూ… పెళ్లి చేసుకుని, లవర్స్ ను అన్నాచెల్లెళ్లు చేసే పేరెంట్స్… తేడా యవ్వారమే

OTT Movie : బుర్రపాడు సీన్లురా బాబూ… పెళ్లి చేసుకుని, లవర్స్ ను అన్నాచెల్లెళ్లు చేసే పేరెంట్స్… తేడా యవ్వారమే
Advertisement

OTT Movie : సినీనటి ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమా ఈ నెల 27న నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా రొమాంటిక్ సన్నివేశాలు, కుటుంబ డ్రామా, ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఒక ప్రేమ జంట, తమ ప్రేమను నిలుపుకోవడానికి చేసే ప్రయాత్నాలతో నడుస్తుంది. ఇందులో ప్రేమికులే అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సిరీస్.  దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

Advertisement

‘మేమిద్దరం’ (Memiddaram) ETV Win ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో 2025 జులై 27న ప్రీమియర్ అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా. ఇది “ప్రేమ గెలుస్తుందా లేక విధి గెలుస్తుందా?” అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ స్టోరీ రెండు కుటుంబ బంధాల మధ్య చిక్కుకున్న ఒక ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ స్టోరీ ఒక ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఈ జంట తమ ప్రేమను కాపాడుకోవడానికి కుటుంబ ఒత్తిడులు, ఊహించని ట్విస్టులను ఎదుర్కొంటారు. ఈ ప్రేమ జంట కరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. వీరి కథ మొదట హాయిగా సాగుతుంది. కానీ ఒక కీలకమైన కుటుంబ రహస్యం బయటపడటంతో, వీరి సంబంధం ఒక సమస్యగా మారుతుంది. అమ్మాయి తల్లి, అబ్బాయి తండ్రి ఈ జంటకు తెలీకుండా పెళ్ళి చేసుకుంటారు. ఈ కారణంగా ఈ ప్రేమ జంట అన్నా, చెల్లెళ్ళు అవుతారు. ఈ రహస్యం వీరి ప్రేమను పరీక్షకు గురిచేస్తుంది. ఈ జంట ప్రేమ, కుటుంబ బాధ్యతల మధ్య ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రియుడు తన కుటుంబం కోసం తన ప్రేమను త్యాగం చేయాలా వద్దా అనే గందరగోళంలో పడతాడు.

ఇదే సమయంలో ప్రియురాలు కూడా తన కుటుంబం నుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆమె తల్లి ఈ సంబంధాన్ని ఒప్పుకోకపోవడంతో మానసిక వేదనకి గురవుతుంది. ఈ కథలో ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఇది ఈ ప్రేమ జంటను, వీరి సన్నిహితులను షాక్‌లోకి నెట్టివేస్తుంది. ఈ ట్విస్ట్ వారి ప్రేమను మరింత సమస్యల్లోకి తీసుకెళ్తుంది. వీళ్ళు తమ భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆలోచింపజేస్తుంది. చివరికి ఈ జంట తమ ప్రేమని గెలుస్తారా ? విధికి లొంగిపోతారా ? అనే విషయాలను ఈ రొమాంటిక్ డ్రామా సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : రాత్రిపూట మాత్రమే డ్యూటీ చేసే పోలీస్… లేడీ యాక్టివిస్ట్ ఎంట్రీతో ఊహించని మలుపు… తెలుగులోనూ స్ట్రీమింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×