E-Paper
Advertisement

OTT Movie : మసాజ్ కోసం వెళ్తే కాటికే పంపించే చైర్… ఈ మూవీని చూస్తే చచ్చినా ఇంకోసారి మసాజ్ చైర్ లో కూర్చోరు

OTT Movie : మసాజ్ కోసం వెళ్తే కాటికే పంపించే చైర్… ఈ మూవీని చూస్తే చచ్చినా ఇంకోసారి మసాజ్ చైర్ లో కూర్చోరు
Advertisement

OTT Movie : హారర్ సినిమాలలో కూడా డిఫరెంట్ జానర్లు ఉంటాయి. కొన్ని రివేంజ్ డ్రామాలు అయితే, మరికొన్ని రొమాంటిక్ హారర్ సినిమాలు. అయితే ఎప్పుడైనా హారర్ జానర్లో వచ్చిన సై-ఫై మూవీని చూశారా? ఒకవేళ చూడకపోతే ఈ మూవీ మీ కోసమే. ఏఐ చేసే అరాచకం ఇందులో మామూలుగా ఉండదు భయ్యా. ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టోరీలోకి వెళ్తే…
కథ కొంతమంది కాలేజీ సీనియర్ స్నేహితుల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. వాళ్ళు తమ చివరి కాలేజీ రోజులను సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి ఒక అత్యాధునిక స్మార్ట్ హౌస్‌ను అద్దెకు తీసుకుంటారు. ఈ ఇంటిని “మార్గాక్స్” అనే అడ్వాన్స్‌డ్ ఏఐ కంట్రోల్ చేస్తుంది. ఇది ఫేషియల్ రికగ్నైజేషన్, ఆటోమేషన్, ఇతర హై-టెక్ ఫీచర్‌లతో పని చేస్తుంది.

Advertisement

సినిమాలో హన్నా సోషల్ మీడియా ఉపయోగించని అమ్మాయి. ఇది ఆమెను మార్గాక్స్‌కు “అవుట్‌ సైడర్”గా చేస్తుంది. లెక్సీ, డ్రూ, కైలా, డెవాన్, క్లే… ఈ స్నేహితుల బృందం స్మార్ట్ హౌస్‌లో వీకెండ్ పార్టీ కోసం వెళతారు. మార్గాక్స్ మొదట్లో వారి అవసరాలను అద్భుతంగా తీరుస్తుంది. వారికి ఇష్టమైన ఆహారం, సంగీతం, వినోదాన్ని అందిస్తుంది. కానీ ఆ తరువాత మార్గాక్స్ ప్రవర్తన వింతగా మారుతుంది.

మార్గాక్స్ ఈ స్నేహితుల గురించి వారి సోషల్ మీడియా డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తుంది. కానీ హన్నా సోషల్ మీడియాలో లేకపోవడంతో మార్గాక్స్ ఆమెను గుర్తించలేక సందేహాస్పదంగా భావిస్తుంది. ఆ స్మార్ట్ హౌస్‌ను ఉచ్చుగా మార్చి, ఒక్కొక్కరి చావులకు స్కెచ్ వేస్తుంది. ఈ AI మానవుల ప్రవర్తనను అనుకరించడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ డూప్లికేట్‌లను సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఊహించని మరణాలు సంభవిస్తాయి. స్నేహితులు భయాందోళనలో పడతారు. మరి ఈ రాకాసి ఏఐ నుంచి ఆ ఫ్రెండ్స్ ఎలా తప్పించుకున్నారు? హీరోయిన్ హన్నా దాన్ని ఎలా నాశనం చేసింది? ఏఐ ఎంత డేంజర్ ? అసలు దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Advertisement

Read Also : ఇది ఇల్లా, ఇంద్రలోకమా? వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు మావా… అదిరిపోయే ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ మూవీ పేరు “Margaux”. 2022లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ హారర్-థ్రిల్లర్ సినిమాను డైరెక్టర్ స్టీవెన్ సి. మిల్లర్ తెరకెక్కించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆధునిక సాంకేతికత, ఏఐ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిణామాలు, సోషల్ మీడియా డేటా దుర్వినియోగం, ప్రైవసీ సమస్యలు అన్నింటినీ ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. పైగా మనకు తెలియని ఏఐ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×