E-Paper
Advertisement

OTT Movie : ఒకే డాక్టర్ పై ఇద్దరమ్మాయిల ఇంట్రెస్ట్… మెంటలెక్కించే ట్రయాంగిల్ లవ్ స్టోరీ… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఒకే డాక్టర్ పై ఇద్దరమ్మాయిల ఇంట్రెస్ట్… మెంటలెక్కించే ట్రయాంగిల్ లవ్ స్టోరీ… లాస్ట్ ట్విస్ట్ హైలెట్
Advertisement

OTT Movie : ట్రయాంగిల్‌ లవ్ స్టోరీలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి సినిమాలు అన్ని భాషల్లో వస్తుంటాయి. కాస్త కథ బాగుంటే, ఇలాంటి సినిమాలను వదలకుండా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. రీసెంట్ గా ఓటీటీలో సందడి చేస్తోంది. సముద్ర తీరం నేపథ్యంలో జీవితంపై ఫిలాసఫికల్ ఆలోచనలతో ఈ కథ నడుస్తుంది. దీనిపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

Advertisement

‘మనదా కడలు’ (Manada Kadalu) 2025లో విడుదలైన కన్నడ రొమాంటిక్ చిత్రం. యోగరాజ్ భట్ రచన, దర్శకత్వంలో, ఇ. కృష్ణప్ప నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ‘ముంగారు మళే’ తర్వాత 18 ఏళ్లకు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సుముఖ, రషీకా శెట్టి, అంజలి అనీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మార్చి 28న థియేటర్లలో విడుదలై, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 15 నుండి స్ట్రీమింగ్‌లో ఉంది. IMDbలో 7.4/10 రేటింగ్ ను పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

సుముఖ మైసూర్‌లో MBBS నాలుగో సంవత్సరం చదువుతూ సరదాగా గడుపుతుంటాడు. అయితే ఆ కాలేజీ ప్యూన్ గుండెపోటుతో చనిపోవడం చూసి డాక్టర్లపై నమ్మకం కోల్పోయి చదువు మానేస్తాడు. ఆతరువాత కర్ణాటక బీచ్‌లలో సముద్రంలో ఈత కొడుతూ, సూర్యాస్తమయాలు చూస్తూ రోజులు గడుపుతాడు. ఇలాఉంటే ఒక రోజు బీచ్‌లో రషీకా అనే ఒక క్రికెటర్‌ను కలిసి, మొదటి చూపులో ప్రేమలో పడతాడు. రషీకా, తన క్రికెట్ కలల కోసం ఆరు నెలలు వేచి ఉండమని చెప్పి బెంగళూరులో మాయమవుతుంది. సుముఖ ఆమెను వెతుకుతూ మురుద్-జంజీరా ద్వీపంలోని ఆర్కియాలజికల్ సైట్‌లో ఆమెను, ఆమె స్నేహితురాలు అంజలిని కనిపెడతాడు. అక్కడ సుముఖకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. రషీకాకు ALS టెర్మినల్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఇది స్టీఫెన్ హాకింగ్‌కు ఉన్న అదే వ్యాధి.

సుముఖ, రషీకాను హీల్ చేయడానికి ప్రయత్నిస్తూ, అంజలితో కూడా ప్రేమలో పడతాడు. ఇది ఒక ఎమోషనల్ లవ్ ట్రయాంగిల్‌గా మారుతుంది. అంజలి ఆ ద్వీపంలోని చరిత్ర తవ్వుతూ, ఒక రాజు ఇద్దరు భార్యలతో జీవించి, ఒకరిని వ్యాధి నుండి కాపాడిన కథను తెలుసుకుంటుంది. ఇది సుముఖ జీవితానికి ఒక ప్రతిబింబంగా ఉంటుంది. మరి ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? ఈ ట్రయాంగిల్‌ స్టోరీ ఎంతవరకూ వెళ్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ కన్నడ రొమాంటిక్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : భర్తనే ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్… కట్టుకున్నోన్ని వదిలేసి ఆటగాడితో… వాడిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×