E-Paper
Advertisement

Roslin OTT Release : మీనా థ్రిల్లర్ సిరీస్ పై హాట్ స్టార్ అఫిషియల్ అనౌన్స్మెంట్… లైన్లో ఇంకా 4 వెయిటింగ్

Roslin OTT Release : మీనా థ్రిల్లర్ సిరీస్ పై హాట్ స్టార్ అఫిషియల్ అనౌన్స్మెంట్… లైన్లో ఇంకా 4 వెయిటింగ్
Advertisement

Roslin OTT Release : మలయాళం నుంచి సినిమాలే కాదు, సిరీస్ లు కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తో వస్తున్నాయి. డిసెంబర్ 2025లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన మలయాళ సిరీస్ ‘ఫార్మా’ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ వంటివి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రజలకు తెలియని విషయాలను కూడా వీటిద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మరో సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఇది థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతోంది. సీనియర్ నటి మీనా ఇందులో నటిస్తుండటంతో ఈ సిరీస్ పై అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది

ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘రోస్లిన్’ (Roslin). సీనియర్ నటులు మీనా, వినీత్ నటించిన ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌ లో OTTplay ప్రీమియం ద్వారా డిజిటల్‌గా స్ట్రీమింగ్ కానుంది. సదరు ఓటీటీ ఆఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది. అయితే ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు. వచ్చే నెల రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 2026 లో రోస్లిన్‌తో సహా ఐదు మలయాళ వెబ్ సిరీస్‌ లు రానున్నాయి. అయితే ఓటీటీలోకి వచ్చే మొదటి మలయాళ వెబ్ సిరీస్ ‘రోస్లిన్’ కావడం గమనించదగ్గ విషయం. ఇక ఈ సిరీస్ షో రన్నర్ గా ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ ఉన్నారు. సుమేష్ నందకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

కథా సారాంశం

Advertisement

ఈ సిరీస్ 17 ఏళ్ల రోస్లిన్ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు కలలో పదే పదే ఒక వింత వ్యక్తి కనిపిస్తూ భయపెడుతుంటాడు. అయితే ఒకరోజు ఆ కలలోని వ్యక్తి నిజంగానే ఆమె ఇంటికి అతిథిగా రావడంతో ఆమె జీవితం తలకిందులవుతుంది. తన తల్లిదండ్రులు అతని మాయలో పడిపోయినా, రోస్లిన్ మాత్రం అతని అసలు రూపాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ? కలలో ఎందుకు కనిపిస్తున్నాడు ? అతని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : హోలీ పండగ రోజు ఊర్లో ఒకరు బలి… గ్రామాన్ని వెంటానే భయంకరమైన శాపం… మతిపోగొట్టే మరాఠీ ఒరిజినల్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×