E-Paper
Advertisement

OTT Movie : హర్రర్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు ఇవే

OTT Movie :  హర్రర్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు ఇవే
Advertisement

OTT Movie : నవంబర్ రెండో వారం (2025 నవంబర్ 14) మలయాళ సినిమా ప్రేమికులకు బిగ్ ట్రీట్. హర్రర్ కామెడీ నుంచి థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ వరకు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో ముఖ్యంగా Inspection Bungalow వెబ్ సిరీస్, Poyyamozhi మూవీ, Coupling సిరీస్‌లు హైలైట్. ఈ వీకెండ్ ఏమి చూడాలో కన్ఫ్యూజన్ అయితే ఈ లిస్ట్ మీకోసమే. మరెందుకు ఆలస్యం మలయాళం మూవీ లవర్స్ వీటిపై ఓ లుక్ వేయండి.

1. ‘Inspection Bungalow’

ఈ హర్రర్ కామెడీ వెబ్ సిరీస్ ZEE5లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అరవంగాడు అనే గ్రామంలో పోలీస్ స్టేషన్‌ను పాడుబడిన ఫారెస్ట్ బంగ్లాకు మార్చాల్సి వస్తుంది సబ్ ఇన్‌స్పెక్టర్ విష్ణు. ఆ బంగ్లాలో దెయ్యాలు, అనుమానాస్పద మరణాలు, దశాబ్దాల నాటి మిస్టరీలు ఉంటాయి. కానీ ఈ కథ కామెడీ హర్రర్‌తోనే నడుస్తుంది. ఇందులో శబరీష్ వర్మ, ఆధ్య ప్రసాద్, షాజు శ్రీధర్, సెంథిల్ కృష్ణ వంటి నటులు నటించారు.

2. Poyyamozhi

Advertisement

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ Manorama Max, Simply South లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది. జాసన్ అనే యువకుడు అడవిలో పారిపోతాడు. అక్కడ పోయ్యామొరి అనే వ్యక్తి అతనికి గైడ్‌గా సహాయం చేస్తాడు. ఈ ప్రయాణం ఉత్కంఠభరితమైన వేటగాడు, బాధితుడు ఛేజింగ్‌గా మారుతుంది, ఇందులో ఊహించని మలుపులు ఉంటాయి. ఈ సినిమా 2025 కేన్స్ ఆర్ట్ అవార్డులలో ఉత్తమ దర్శకుడు (సుధీ అన్న), ఉత్తమ సినిమాటోగ్రఫీ (వినోద్ ఇల్లంపిల్లి) విభాగాలలో ఈ చిత్రం ఎంపికైంది. ఈ థ్రిల్లర్ మీ మతిని పక్కాగా పోగొడుతుంది. ఇందులో జాఫర్ ఇడుక్కి, నాథనియల్ మాధతిల్, మీనాక్షి అనూప్ లీడ్ రోల్స్ లో నటించారు.

3. Coupling

ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ Manorama Max లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన ఒక యువకుడు తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పెళ్లికి ఫొటోగ్రాఫర్‌గా హైర్ అవుతాడు. అక్కడ కొత్త అమ్మాయితో లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఇది నాలుగు పాత్రల మధ్య ఒక విచిత్రమైన ప్రేమ కథ నడుస్తుంది. ఇందులో సర్జానో ఖాలిద్, శ్రీనాథ్ బాబు, వైష్ణవి రాజ్, మాలవిక శ్రీనాథ్ లీడ్ రోల్స్ లో నటించారు. వీటితో పాటు Avihitham (JioHotstar, నవంబర్ 14) ఒక చిన్న పట్టణంలో గాసిప్‌లు ఎలా జీవితాల్ని మారుస్తాయో చెప్పే సాఫ్ట్ కామెడీ డ్రామా సినిమా అందుబాటులోకి వస్తోంది. ఇక ఈ వీకెండ్ ను మీ ఇంట్లోనే ఫ్యామిలీతో పాటు సెలెబ్రేట్ చేసుకొండి.

Advertisement

 

Read Also : సిటీలో డ్రైవర్ గా అడుగుపెట్టి అండర్ వరల్డ్ అవతారం… అమ్మ సెంటిమెంట్ తో అదిరిపోయే కన్నడ యాక్షన్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×