E-Paper
Advertisement

Malayalam movie OTT : ఓటీటీలోకి మూడు నెలల తరువాత మలయాళం మిస్టరీ మూవీ… నాగ దేవత చుట్టూ కథ

Malayalam movie OTT : ఓటీటీలోకి మూడు నెలల తరువాత మలయాళం మిస్టరీ మూవీ… నాగ దేవత చుట్టూ కథ
Advertisement

Malayalam movie OTT : మరో మలయాళ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన సైకాలజికల్ థ్రిల్లర్, థియేటర్లలో విడుదలైన సుమారు మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఐయండిబిలో 7.8 రేటింగ్ సాధించిన ఈ సినిమా థియేటర్లలో చాలా మంది మిస్ అయ్యారు. ఎందుకంటే తక్కువ థియేటర్లలోనే ఇది రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు అందరూ ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలోకి వస్తోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్

సజిన్ బాబు దర్శకత్వం వహించిన ‘థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ’ (Theatre: The Myth of Reality) ఈ సినిమాలో రిమా కల్లింగల్ ప్రధాన పాత్ర పోషించారు. సరస బాలుస్సేరి, మీనాక్షి రవీంద్రన్, మేఘా రాజన్, బాలాజీ శర్మ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా 2026 ఫిబ్రవరి 21 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మలయాళం ఆడియోతో వస్తుంది, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంటాయి. రీమా కల్లింగల్ అద్భుతమైన నటనకు గాను ఆమెకు 2025 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్‌ అవార్డు లభించింది.

కథ ఏమిటంటే 

Advertisement

కేరళలోని ఒక మారుమూల ప్రాంతంలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మీరా (రీమా కల్లింగల్), ఆమె తల్లి జీవిస్తుంటారు. వీళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటూ, నాగదేవతలను అమితంగా పూజలు చేస్తారు. పురాతన ఆచారాలను పాటిస్తూ ప్రశాంతంగా జీవితం గడుపుతుంటారు. కానీ ఒక రోజు మీరాకు అకస్మాత్తుగా, వింత కీటకం కుట్టి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడంతో వాళ్ళ జీవితం తలకిందులవుతుంది. మీరాకి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. మీరాకు చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినా, ఆమె తల్లి మాత్రం అది నాగదేవత శాపమని నమ్ముతుంది.

ఈ పరిస్థితుల్లో ఒక యూట్యూబర్ ద్వారా ఈ విషయం సోషల్ మీడియాకు చేరుతుంది. దీంతో ఈ విషయం ఒక జాతీయ స్థాయి చర్చకు వేదికగా మారుతుంది. సహాయం చేసే నెపంతో వచ్చే ఎన్జీవోలు, వ్యూస్ కోసం పాకులాడే వ్లాగర్లు, రాజకీయ నాయకుల రాకతో వాళ్ళ ప్రశాంతత కూడా ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతుంది. చివరికి మీరాను కాపాడింది వైద్యమా? లేక వాళ్ళ నమ్మకమా? అనే ప్రశ్నతో సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also : వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల హత్యలు.. ముందుగానే ఊహించే బాబా… క్షణ క్షణం ఉత్కంఠ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×