E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలోకి మరో మలయాళం డ్రామా… థియేటర్లకు వెళ్లకుండానే వారణాసి నేపథ్యంలో వస్తున్న మూవీ

OTT Movie : ఓటీటీలోకి మరో మలయాళం డ్రామా… థియేటర్లకు వెళ్లకుండానే వారణాసి నేపథ్యంలో వస్తున్న మూవీ
Advertisement

OTT Movie : మరో మలయాళం సినిమా ఓటీటీలోకి వచ్చింది. ‘ప్యూప’ (Pupa) అనే ఈ సినిమా థియేటర్లకు వెళ్లకుండానే నేరుగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇది చెన్నై ఫిల్మ్  ఫెస్టివల్ లో కథ, నటన రెండింటికీ ప్రశంసలు అందుకుంది. ఇది వారణాసిలోని ఒక వ్యభిచార గృహం చుట్టూ తిరుగుతుంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అంటే

టోనీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్యూప’ (Pupa) 2026 ఫిబ్రవరి 21 నుంచి Manorama Max ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో జీవేష్ వర్గీస్, దీపా సాజు ప్రధాన పాత్రలు పోషించారు. హరిదాస్ కెఆర్, అభిలాష్, ప్రమోద్ పాటియాత్, జియోమి ఎన్ జార్జ్, కృష్ణ సురేష్, షెనిన్ షాజహాన్, పౌర్ణమి వంటి నటీనటులు కూడా ఉన్నారు. రఘుపతి పై ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వారణాసిలోని ఒక వేశ్యాగృహం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులు, ఒకేచోట చేరినప్పుడు జరిగే డ్రామాని దర్శకుడు ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా అక్కడికి వచ్చే విటులు, అక్కడ పనిచేసే మహిళల మధ్య తలెత్తే ఊహించని గొడవలు కథను మలుపు తిప్పుతాయి. కేవలం శృంగారం, క్రైమ్ కోణంలోనే కాకుండా, వాళ్ళ జీవితాల గురించి ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ‘ప్యూప’ (గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారే దశ) అనే పేరు పెట్టారు.

పవిత్రమైన గంగా నది తీరంలో వేశ్యాగృహం నేపథ్యం నుంచి వచ్చిన ఈ సినిమా, ఒక వృద్ధుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అతనికి తన జీవిత చివరి దశలో ఒక వింతైన కోరిక ఉంటుంది. సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని దహనం లేదా ఖననం చేయడం చేస్తారు. కానీ ఈ వృద్ధుడు తన శరీరాన్ని ప్రకృతికి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని అనుకుంటాడు. అంటే ఒక గొంగళి పురుగు ప్యూపాగా మారి సీతాకోకచిలుకగా ఎలా మారుతుందో, తన మరణం కూడా మరొక జీవానికి పునాది కావాలని కోరుకుంటాడు. ఈ డిఫరెంట్ మలయాళ సినిమాని మీరు చూడాలనుకుంటే ఈ వాలే చూసేయచ్చు.

Advertisement

Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×