E-Paper
Advertisement

పేషెంట్స్ ను ఆధారాల్లేకుండా చంపే కిల్లర్… ప్రతి ఒక్కరూ చూడాల్సిన మలయాళం మెడికల్ థ్రిల్లర్

పేషెంట్స్ ను ఆధారాల్లేకుండా చంపే కిల్లర్… ప్రతి ఒక్కరూ చూడాల్సిన మలయాళం మెడికల్ థ్రిల్లర్
Advertisement

Malayalam Medical Psychological Thriller: హెల్త్ బాలేకపోతే మనమందరం చేసే మొట్టమొదటి పని ఏంటి ? హాస్పిటల్ కు వెళ్తాం. కానీ ఆ హాస్పిటల్ కు వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రాకపోతే ? పేషెంట్స్ ను ఓ కిల్లర్ ఎలాంటి ఆధారాలు లేకుండా చంపితే ? వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఇదే స్టోరీ లైన్ తో రూపొందిన ఓ మెడికల్ డ్రామానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ఒక ప్రముఖ సిటీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ పనిచేసే ప్రముఖ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్. అతని జీవితం భార్య రగితతో సంతోషంగా సాగుతోంది. కానీ హాస్పిటల్‌లో జాయిన్ అయిన కొందరు రోగులు వరుసగా అనుమానాస్పదంగా మరణించడం మొదలవుతుంది. విచిత్రం ఏమిటంటే, పోస్ట్‌మార్టం నివేదికల్లో మరణానికి సరైన కారణాలు ఏవీ దొరకవు. రోగులు ఊపిరాడక మరణిస్తున్నా, వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడం షాక్ ఇస్తుంది.

Advertisement

డాక్టర్ ప్రకాష్‌కు ఈ వరుస మరణాల వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుమానం కలుగుతుంది. అతను హాస్పిటల్ యాజమాన్యం, అధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్లాడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఈ సమయంలోనే అతని భార్య రగిత కూడా ఊపిరితిత్తుల సమస్యతో అదే హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుంది. భార్య ప్రాణాలను కాపాడుకోవాలని, హాస్పిటల్‌లో జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టాలని డాక్టర్ ప్రకాష్ స్వయంగా రంగంలోకి దిగుతాడు. గతంలో ఒక చేదు అనుభవంతో బాధపడుతున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో కలిసి అతను రహస్యంగా విచారణ ప్రారంభిస్తాడు.

విచారణ ముదురుతున్న కొద్దీ హాస్పిటల్ యాజమాన్యం, మెడికల్ మాఫియా బాగోతాలు, ప్రకాష్ పాత ప్రేయసి డాక్టర్ అరుంధతి మధ్య ఉన్న లింకులు బయటపడతాయి. రోగులకు తెలియకుండా వారి మందుల “డోస్” మార్చి, ప్రయోగాలు చేసి హత్యలు చేస్తున్నారని తెలుస్తుంది. డబ్బు, అధికారం మరియు వ్యక్తిగత పగల కోసం జరుగుతున్న ఈ భయంకరమైన కుట్రలో ప్రకాష్ తన భార్య ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడతాడు. మరి ప్రకాష్ తన భార్యను ఆ మెడికల్ మాఫియా నుంచి కాపాడుకున్నాడా ? అసలు పేషెంట్స్ చనిపోవడానికి గల కారణం ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీపై కన్నేయాల్సిందే.

5 ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

‘డోస్’ సినిమా రొటీన్ మెడికల్ థ్రిల్లర్ కాదు. హాస్పిటల్స్ వెనుక దాగి ఉన్న లాభాపేక్ష, మనుషుల జీవితాలతో ఆడుకునే దుర్మార్గాలు, డాక్టర్లకు ఉండే ఒత్తిళ్లు డెప్త్ గా చూపించే సైకలాజికల్ థ్రిల్లర్. డెబ్యూ డైరెక్టర్ Abhilash R. Nair నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను అందించారు. మనం నమ్మి వెళ్తున్న హాస్పిటల్స్ గురించి ఆలోచింపజేసే ఒక హెచ్చరిక లాంటిది ఈ మూవీ. 2026లో విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మలయాళ మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ 5 ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 10 నుండి Amazon Prime Video, Aha Video, Lionsgate Play, Simply South, ManoramaMAXలలో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×