E-Paper
Advertisement

Sarvam Maya OTT: ఓటీటీలోకి అడుగు పెట్టిన బ్లాక్ బస్టర్ హర్రర్ కామెడీ… IMDbలో 8 రేటింగ్‌… తెలుగులోనూ స్ట్రీమింగ్

Sarvam Maya OTT: ఓటీటీలోకి అడుగు పెట్టిన బ్లాక్ బస్టర్ హర్రర్ కామెడీ… IMDbలో 8 రేటింగ్‌… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Sarvam Maya OTT : క్రిస్మస్ కానుకగా వచ్చిన ‘సర్వం మాయ’ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మలయాళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదవ మలయాళ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నివిన్ పౌలీ నటించిన మొదటి ₹100 కోట్ల మార్క్ దాటిన సినిమా కూడా ఇదే. ఇప్పడు ఈ సినిమా ఓటీటీలోకి కూడా అడుగు పెట్టేసింది. ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఈ సినిమాను చూసి సేద తీరుతున్నారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ ఎందులో అంటే

“సర్వం మాయ” (Sarvam Maya) నివిన్ పౌలీ నటించిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం. దీనికి అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఇందులో రియా శిబు, అజు వర్గీస్, జనార్ధనన్, ప్రీతి ముఖుందన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఫైర్‌ఫ్లై ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఇప్పుడు 2026 జనవరి 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. థియేటర్లలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, ఈ సినిమాని దాని అసలు మలయాళ వెర్షన్‌తో పాటు, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో కూడా అందుబాటులోకి తెచ్చారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ప్రభేందు ‘(నివీన్ పౌలీ ) మంచి గిటారిస్ట్ కావాలని కలలు కంటుంటాడు. ఇందులో భాగంగా యూరప్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అయితే వీసా రిజెక్ట్ కావడంతో తన స్వంత ఊరు పాలక్కడ్ వస్తాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇతని అన్నయ్య, తండ్రి గుళ్ళో పంతుళ్ళు గా చలామణి అవుతుంటారు. తనకి ఇష్టం లేకపోయినా బావ రూపేష్(అజు వర్గీస్)తో కలిసి పౌరోహిత్యంలో సహాయం చేస్తుంటాడు. ఒక రోజు తెలిసిన వాళ్ళ ఇంట్లో దెయ్యాన్ని వెల్లగొట్టడంతో అసలు కథ మొదలవుతుంది.

మొదట్లో అంతా బాగానే అనిపించినా తరువాత విచిత్రమైన సంఘటనకు జరుగుతాయి. తర్వాత నుంచి ఆ దెయ్యం(రియా షిబు) ప్రభేందు వెంటపడుతుంది. చిత్రం ఏమిటంటే ఆదెయ్యం ఇతడికి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ దయ్యం కూడా విచిత్రంగా ఉంటుంది. ఆ దెయ్యానికి తాను ఎలా చనిపోయిందో కూడా ఏమాత్రం గుర్తుకు ఉండదు. ఇక ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు ఆ దెయ్యానికి. అసలు ఆ దయ్యం ఎవరు ? దాని గతం ఏమిటి ? ఎందుకు ప్రభేందుకి మాత్రమే కనబడుతోంది ? దాని వల్ల ప్రభేందు ఎలాంటి చిక్కుల్లో పడతాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఈ ఏడాది రెండు సిరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ కు విజయ్ సేతుపతి అదిరిపోయే ట్రీట్… ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×