E-Paper
Advertisement

మగాళ్లు మాత్రమే ఉండే ఇంట్లో పెళ్లి తెచ్చిన గందరగోళం… నవ్వించి చంపేస్తున్న మలయాళం సినిమా ఓటీటీలోకి

మగాళ్లు మాత్రమే ఉండే ఇంట్లో పెళ్లి తెచ్చిన గందరగోళం… నవ్వించి చంపేస్తున్న మలయాళం సినిమా ఓటీటీలోకి
Advertisement

Comedy movie on OTT : ఓటీటీలోకి మరో మలయాళం సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ ను మెప్పించి, ఓటీటీ ఆడియన్స్ ను అలరించబోతోంది. ఇది ఒక పక్కా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబం అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునేలా, ఎలాంటి వల్గారిటీ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పెళ్లికి ముందు లవ్ స్టోరీ, పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు సరదాగా ఆకట్టుకునేలా ఉంటాయిఇందులో. మరోవైపు ఇది అవుట్ అండ్ అవుట్ సిట్యుయేషనల్ కామెడీ సినిమా. ఆడవాళ్లే లేని ఒక మగాళ్ల ఇంట్లోకి కొత్త కోడలు అడుగుపెడితే, అక్కడ జరిగే గందరగోళం చుట్టూనే కామెడీ అంతా తిరుగుతుంది. భారీ యాక్షన్ సీన్లు, మైండ్ గేమ్‌లు లేకుండా… మన పక్కింట్లో జరిగే కథలా అనిపించే ఓ చక్కటి మధ్యతరగతి కుటుంబ కథాచిత్రం ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ మలయాళ రోమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘మధువిధు’ (Madhuvidhu). ఇది థియేటర్లలో 2026 ఏప్రిల్ 23న రిలీజ్ అవ్వడంతో పాటు ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసింది కూడా. ఇందులో హీరోగా షరాఫుద్దీన్ నటించగా, సీనియర్ నటి బిందు పణిక్కర్ కుమార్తె కళ్యాణి పణిక్కర్ ఈ చిత్రంతోనే హీరోయిన్‌గా పరిచయమైంది. వీరితో పాటు జగదీష్, సాయికుమార్, అజీస్ నెడుమంగడ్ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విష్ణు అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అజిత్ వినాయక ఫిల్మ్స్ బ్యానర్‌పై వినాయక అజిత్ నిర్మించారు. తెలుగులో ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కేవలం నెల రోజుల్లోనే డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. ఈ సినిమా శుక్రవారం (మే 22) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ SonyLIV లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథ విషయానికి వస్తే, అమ్ము (అమృతరాజ్) అనే కుర్రాడికి అసలు పెళ్లే కాదేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. దానికి కారణం అతని కుటుంబమే. ఆడవాళ్లే లేని, కేవలం ఐదుగురు మగాళ్లు మాత్రమే ఉండే ఒక గందరగోళమైన ఉమ్మడి ఇంట్లో అతను పెరుగుతాడు. ఆ ఇంటి వాతావరణం చూసి వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతుంటాయి. అలాంటి టైమ్‌లో స్నేహ మార్కోస్ అనే అమ్మాయితో మనోడు లవ్‌లో పడతాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించి, ఎట్టకేలకు ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవుతారు.

అయితే అసలు కథ పెళ్లయ్యాకే మొదలవుతుంది. అంతవరకు మగాళ్లు మాత్రమే రాజ్యం ఏలిన ఆ గజిబిజి ఇంట్లోకి కొత్త కోడలు అడుగుపెట్టడంతో బోలెడంత కామెడీ, హడావుడి మొదలవుతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ, కొత్త పెళ్లి ముచ్చట్లు తగ్గిపోయి రోజువారీ గొడవలు, బాధ్యతలు తలకెక్కుతాయి. ఈ క్రమంలో ఆ పెళ్లయిన కొత్త జంట మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు, వాటిని వాళ్లు ఎలా సర్దుబాటు చేసుకున్నారనేదే సినిమా.

Advertisement

Read Also : ఈత నేర్పిస్తూ అమ్మాయిని బుట్టలో వేసే కుర్రాడు… లవర్స్ చూడాల్సిన చూడచక్కని సినిమా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×