E-Paper
Advertisement

టైటాన్ వాచ్ కి ఇంత చరిత్ర ఉందా ?… 6 ఎపిసోడ్‌ల ఈ చారిత్రక డ్రామా సిరీస్ ను చూశారా ?

టైటాన్ వాచ్ కి ఇంత చరిత్ర ఉందా ?… 6 ఎపిసోడ్‌ల ఈ చారిత్రక డ్రామా సిరీస్ ను చూశారా ?
Advertisement

Inspirational Business Drama OTT : ఓటీటీలో పాత పాత క్రైమ్ థ్రిల్లర్లు, రొమాంటిక్ కామెడీలు చూసి విసిగి పోయారా ? కొత్తదనం, నిజమైన స్ఫూర్తి కావాలనుకునే వారికోసం ఇప్పుడు ఒక సూపర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సిరీస్ పేరు ‘మేడ్ ఇన్ ఇండియా : ది టైటాన్ స్టోరీ’ (Made in India The Titan). ఇది భారతదేశం మొదటి ప్రపంచ స్థాయి వాచ్ బ్రాండ్ టైటాన్ ఎలా పుట్టిందో చెప్పే అద్భుతమైన బయోగ్రాఫికల్ డ్రామా సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. IMDbలో 8.8 రేటింగ్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇప్పుడంటే వాచ్ లలో ఎన్నో బ్రాండ్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. అయితే ఇప్పటికీ కొత్త గడియారం కొనాలనిపించినప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చే బ్రాండ్ టైటాన్ కదా ? కానీ ఆ టైటాన్ ఎలా పుట్టింది ? 1970-80లలో భారతదేశంలో గడియారాల మార్కెట్ ఎలా ఉండేది ? స్మగ్లర్లు, చౌకైన చైనా గడియారాలు, ఖరీదైన విదేశీ బ్రాండ్లు.. ఇవే రాజ్యం ఏలేవీ. ఆ సమయంలో భారతీయులు మంచి గడియారాలు తయారు చేయలేవని ప్రపంచం నమ్మేది. అదే క్రమంలో అప్పుడు జె.ఆర్.డి. టాటాకు ఒక స్విస్ కంపెనీ వాళ్ల నుంచి భారీ అవమానం జరుగుతుంది. ఆ అవమానం జె.ఆర్.డిని కదిలిస్తుంది. అప్పుడు ఆయన తన కంపెనీలోని డైనమిక్ ఎగ్జిక్యూటివ్ జెర్క్సెస్ దేశాయ్‌ కి ఈ బాధ్యత అప్పగిస్తారు. సున్నా నుంచి ప్రపంచ స్థాయి స్వదేశీ వాచ్ బ్రాండ్‌ను నిర్మించాలి అన్నది టార్గెట్. ఇది అంత సాధారణ పని కాదు… టెక్నాలజీ లేదు, అనుభవం లేదు, మార్కెట్‌ లో భారీ పోటీ. కానీ జెర్క్సెస్ దేశాయ్ ధైర్యం, ఆవేశం, తెలివితేటలతో అసాధ్యమైన ఈ పనిని సుసాధ్యం చేశారు. ఈ సిరీస్ ఆ సాహసోపేతమైన ప్రయాణాన్ని చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఒక అవమానం నుంచి ఎలా ప్రపంచ స్థాయి బ్రాండ్ పుట్టిందో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో హార్ట్ టచింగ్‌ గా చెబుతుంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే మాట ఎంత గొప్పదో ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది.

Advertisement

Also Read : వితంతు మహిళతో వింత మనిషి ప్రయాణం… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

నసీరుద్దీన్ షా జె.ఆర్.డి. టాటా పాత్రలో అద్భుతంగా ఉంది. ఆయన ముఖం చూస్తేనే టాటా సాహేబ్ కనిపిస్తారు. జిమ్ సర్భ్ జెర్క్సెస్ దేశాయ్‌గా చాలా ఎనర్జీ, ఆవేశంతో నటించాడు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలను బాగా బ్రతికించారు. ఈ సిరీస్ జూన్ 3 నుంచి MX ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు చాలా మంది చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కేవలం బిజినెస్ స్టోరీ కాదు… స్వాభిమానం, ధైర్యం, కష్టం, విజయం గురించి. యువతకు ఎంతో స్ఫూర్తి ఇచ్చే సిరీస్ ఇది. మీరు బిజినెస్, హిస్టరీ, ఇన్‌స్పిరేషనల్ స్టోరీలు ఇష్టపడేవాళ్లైతే తప్పకుండా చూడండి. ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపలేరు. టైటాన్ గడియారం మీ చేతిలో ఉన్నా లేకపోయినా, ఈ సిరీస్ చూసిన తర్వాత గర్వంగా “మేడ్ ఇన్ ఇండియా” అని చెప్పాలనిపిస్తుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×